ETV Bharat / bharat

నిర్భయ దోషి పవన్​ రివ్యూ​ పిటిషన్​ను కొట్టేసిన సుప్రీం

నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్​ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. నేర సమయంలో తాను మైనర్​ అంటూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీం గతంలో తిరస్కరించింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలని నేడు పవన్​ పిటిషన్​ వేయగా మళ్లీ నిరాశే ఎదురైంది.

Nirbhaya case: SC dismisses Pawan's plea for review of order rejecting juvenility claim
నిర్భయ దోషి పవన్​ రివ్యూ​ పిటిషన్​ను కొట్టేసిన సుప్రీం
author img

By

Published : Jan 31, 2020, 7:05 PM IST

Updated : Feb 28, 2020, 4:48 PM IST

నిర్భయ సామూహిక అత్యాచారం, హత్యోదంతం కేసులో మరణ శిక్ష విధించిన దోషుల్లో ఒకరైన పవన్​ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్​ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాన్ని పరిశీలించి మళ్లీ కొట్టివేసింది.

నేరం చేసిన సమయంలో తాను మైనర్​ అన్న వాదనను దిల్లీ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ.. పవన్​ దాఖలు చేసిన పిటిషన్​ను జనవరి 20నే అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. తాజాగా ఈ ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ పవన్​ తరఫున న్యాయవాది ఏపీ సింగ్​ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా దిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తీర్పు వెలువరించే ముందు తెలిపింది ధర్మాసనం.

న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే

జనవరి 20న వాదనల సమయంలో.. పవన్​ పాఠశాల ధ్రువీకరణ పత్రం ప్రకారం నేరం జరిగిన సమయానికి అతను మైనర్​ అంటూ దోషి తరఫున న్యాయవాది ఏపీసింగ్​ వాదించారు. దిల్లీ పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. న్యాయపరంగా పవన్​ జువైనల్​ పిటిషన్​పై అన్ని పరిశీలనల తర్వాతే కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని, దోషికి పదేపదే ఈ కేసును లేవనెత్తే అనుమతినిస్తే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లవుతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కరోనాపై అతి చేయకండి: ప్రపంచ దేశాలకు చైనా 'క్లాస్​'

Last Updated : Feb 28, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.