ETV Bharat / bharat

'నిర్భయ' కేసు దోషి నిరాహార దీక్ష చేస్తున్నాడా?

author img

By

Published : Feb 17, 2020, 3:40 PM IST

Updated : Mar 1, 2020, 3:05 PM IST

నిర్భయ దోషులకు కొత్తగా డెత్ వారెంట్​ జారీ చేయాలన్న పిటిషన్లపై దిల్లీ కోర్టు విచారణ జరిపింది. ఇరువర్గాల తరఫున వాదనలు పూర్తయ్యాయి.

Nirbhaya case: Convict Mukesh refuses to be represented by advocate Vrinda Grover
నిర్భయ కేసు : కొత్త డెత్ వారెంట్​పై వాదనలు.. కాసేపట్లో తీర్పు

నిర్భయ దోషులకు కొత్తగా డెత్‌ వారెంట్‌ జారీ అంశంపై.. దిల్లీ పాటియాలా హౌస్​​ కోర్టులో వాదనలు ముగిశాయి. దోషుల పిటిషన్లు తమ వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. డెత్‌ వారెంట్‌ జారీ చేయొచ్చని ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినందున.. నిందితులకు కొత్తగా ఉరిశిక్ష తేదీలు ఖరారు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న ధర్మాసనం.. దోషుల్లో ఒకడైన ముకేశ్​ సింగ్‌ తరఫున వాదించేందుకు బృందా గ్రోవర్ స్థానంలో రవి ఖాజిని నియమించింది. అయితే తన తరఫున వాదించేందుకు న్యాయవాది అవరసం లేదని కోర్టుకు తెలిపాడు ముకేశ్​.

మరో దోషి అయిన అక్షయ్.. కొత్తగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయనున్నట్లు న్యాయవాది ఏపీ సింగ్​ కోర్టుకు తెలిపారు. గతంలో దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​కు అన్ని పత్రాలు జోడించలేదని తెలిపిన ఆయన.. పూర్తి వివరాలతో మరోసారి రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నట్లు కోర్టుకు విన్నవించారు. నిర్భయ కేసులో మరో నిందితుడైన వినయ్​ శర్మ.. తిహార్ జైలులో నిరాహార దీక్ష చేస్తున్నాడని ఏపీ సింగ్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం వినయ్​ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించాలని అధికారులను ఆదేశించింది కోర్టు.

"వినయ్ ప్రస్తుతం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వినయ్​పై జైలులో శారీరక దాడి చేశారు. అతని తలపై గాయాలున్నాయి. పవన్​ గుప్తా కూడా రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేయనున్నాడు. అలాగే సుప్రీంకోర్టులో క్యురేటివ్​ వ్యాజ్యం వేసేందుకు కూడా సిద్ధమయ్యాడు."

- ఏపీ సింగ్​, దోషుల తరఫు న్యాయవాది

Last Updated : Mar 1, 2020, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.