ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్ 'ఉగ్ర​ ఎన్​జీఓ'ల్లో ఎన్​ఐఏ సోదాలు

జమ్ముకశ్మీర్​లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది ఎన్​ఐఏ. స్వచ్ఛంద కార్యకలాపాల పేరుతో నిధులు సేకరిస్తున్న పలు ఎన్​జీఓలు, ట్రస్ట్​లు.. చివరకు వాటిని కశ్మీర్​లోని ఉగ్రకార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

NIA searches trust, NGOs in Srinagar in terror funding case
జమ్ముకశ్మీర్​ ఎన్​జీఓల్లో ఎన్​ఐఏ సోదాలు
author img

By

Published : Oct 28, 2020, 2:30 PM IST

స్వచ్ఛంద కార్యకలాపాల కోసం వినియోగించాల్సిన నిధులను వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు మళ్లిస్తున్న ఎన్​జీఓలు, ట్రస్ట్​లకు సంబంధించిన కేసులో.. జమ్ముకశ్మీర్​లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది ఎన్​ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ). బెంగళూరులోనూ తనిఖీలు చేపట్టింది.

ఈ సోదాల్లో నేరాన్ని రుజువు చేసే పత్రాలు, ఎలక్ట్రానిక్​ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్​ఐఏ వెల్లడించింది.

"శ్రీనగర్​, బందిపొరలోని 10 ప్రాంతాలు, బెంగళూరులోని ఒక ప్రాంతంలో ఎన్​ఐఏ సోదాలు నిర్వహించింది. స్వచ్ఛంద కార్యకలాపాల పేరుతో దేశంతో పాటు విదేశాల్లో నిధులు సేకరిస్తున్న ఈ ఎన్​జీఓలు, ట్రస్ట్​లు అనంతరం వాటిని జమ్ముకశ్మీర్​లో వేర్పాటువాద పనుల కోసం వినియోగిస్తున్నారు. జేకే కొయిలేషన్​ ఆఫ్​ సివిల్​ సొసైటీ కోఆర్డినేటర్​ ఖుర్రమ్​ పర్వేజ్​, అతని సహచరుడు అహ్మద్​ బుఖారి, బెంగళూరుకు చెందిన జీకే ట్రస్ట్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.​"

--- ఎన్​ఐఏ ప్రకటన.

నిధుల మళ్లింపు వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎన్​ఐఏ ఐపీసీ, యూఏపీఏ సెక్షన్ల కింద ఈ నెల 8న కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం సోదాలు నిర్వహించింది.

ఇదీ చూడండి:- హవాలా ఆపరేటర్ల ఇళ్ల నుంచి రూ.62 కోట్లు జప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.