కేరళలో కలకలం సృష్టించిన 30కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో మరో ఆరుగురిని అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). వీరి నివాసాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించింది. పలు కీలక పత్రాలు సహా రెండు హార్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకుంది.
ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 10మందిని అరెస్టు చేసింది ఎన్ఐఏ. జులై 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసి స్వప్న సురేశ్ సహా నలుగురు నిందితులపై అభియోగాలు మోపింది.
ఇదీ చూడండి: మోదీ కోసం 'జై శ్రీరామ్' సందేశంతో ప్రత్యేక వస్త్రం