40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకొన్న పుల్వామా ఉగ్రదాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). తాజాగా మరో నిందితుడిని అరెస్ట్ చేసింది.
ఘటనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఏడో వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఎన్ఐఏ అధికారులు.
2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జైషే మహ్మద్ ఉగ్ర దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.