ETV Bharat / bharat

రెండేళ్లలో భారత్​కు నూతన పార్లమెంటు భవనం! - రెండేళ్లలో భారత్​కు నూతన పార్లమెంటు భవనం

దేశ రాజధాని దిల్లీలో మరో రెండేళ్లలో నూతన పార్లమెంటు భవనం కనువిందు చేయనుంది. ఈ ఏడాది డిసెంబర్​లో నిర్మాణ పనులు ప్రారంభించి.. 2022 అక్టోబర్​ నాటికి పనులు పూర్తి చేయనున్నారు. ఇటీవలే ఈ భవన నిర్మాణ కాంట్రాక్టును ప్రముఖ సంస్థ టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది.

india parliament building
రెండేళ్లలో భారత్​కు నూతన పార్లమెంటు భవనం...
author img

By

Published : Oct 23, 2020, 8:33 PM IST

ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యం.. పార్లమెంటు భవనం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా.. దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న పార్లమెంటు భవనం స్థానంలో నూతనంగా అధునాతన భవనాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్​లో నిర్మాణం ప్రారంభించి.. రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. 2022 అక్టోబర్​ నాటికి కట్టడం పూర్తిచేయాలని డెడ్​లైన్​ పెట్టింది ప్రభుత్వం. అయితే ఈ సమయంలోనూ పార్లమెంటు సమావేశాలు, విధులు యథావిథిగానే కొనసాగుతాయని లోక్​సభ సెక్రటేరియట్​ శుక్రవారం స్పష్టం చేసింది. డిసెంబర్​లో జరగనున్న భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇరుసభల్లోని రాజకీయ నేతలు భాగం కానున్నారు.

888 మంది కూర్చునేందుకు వీలు..

నూతన భవనంలోని లోక్​సభ ఛాంబర్​లో 888 మంది కూర్చునేందుకు వీలుంటుంది. ఇందులో 384 సీట్లు రాజ్యసభ సభ్యుల కోసం కేటాయించారు. లోక్‌సభ నియోజకవర్గాలను పునర్‌వ్యవస్థీకరిస్తే కొత్తగా వచ్చే సభ్యులకు ప్రస్తుత భవనం సరిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లోక్​సభలో 543 మంది.. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు.

నూతన భవంతి నిర్మాణం సమయంలో గాలి, ధ్వని కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఎంపీకి ప్రత్యేకమైన ఆఫీస్​ కేటాయించడమే కాకుండా వారికి ప్రత్యేకమైన డిజిటల్​ సాంకేతికతతో ఏర్పాట్లు చేయనున్నారు. పూర్తిగా పేపర్​లెస్​ ఆఫీసులుగా మార్చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంలో నిర్మిస్తారని తెలుస్తోంది. ఇందులో భారత ప్రజాస్వామ్య సంస్కృతి ప్రతిబింబించేలా.. భారీ హాల్​ ఉండనుంది. పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్​, ఓ లైబ్రరీ, కమిటీలకు ప్రత్యేకమైన గదులు, భోజన ప్రదేశాలు, పార్కింగ్​ స్థలం ఏర్పాటు చేయనున్నారు.

టాటా సంస్థకే పనులు​...

టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ నూతన ప్రాజెక్టును గతనెలలో దక్కించుకుంది. రూ.861.90 కోట్లకు ఈ కాంట్రాక్ట్‌ సాధించింది. నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఓ కమిటీని నియామకం చేయనున్నారు. ఇందులో లోక్​సభ సెక్రటేరియట్​, హౌసింగ్​ అండ్​ అర్బన్​ అఫైర్స్​ మినిస్ట్రీ, సీపీడబ్ల్యూడీ, ఎన్​డీఎంసీ, ఆర్కిటెక్ట్​ సభ్యులుగా ఉండనున్నారు.

ఆంగ్లేయుల కాలంలో..

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం ఆంగ్లేయుల కాలం నాటిది. దాన్ని ఎడ్విన్​ లుట్యెన్స్​, హెర్బర్ట్​ బేకర్​ కలిసి డిజైన్​ చేశారు. వీరి సారథ్యంలోనే దాని నిర్మాణం జరిగింది. ఈ భవనానికి 1921, ఫిబ్రవరి 12న పునాది రాయి వేశారు. ఆ తర్వాత భవనం పూర్తి కావడానికి 6 ఏళ్లు పట్టింది. ఆ సమయంలో 83 లక్షలు ఖర్చయినట్లు తెలిసింది. 1927, జనవరి 18న భవనాన్ని గవర్నర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా లార్డ్​ ఇర్విన్​ ప్రారంభించారు. పాత భవనాన్ని మరమ్మతులు చేసిన తర్వాత ఇతర పనులకు వాడుకోనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.