ETV Bharat / bharat

'ఈ చట్టాలు వ్యవసాయంలో కొత్త యుగానికి నాంది' - కేంద్ర వ్యవసాయ మంత్రి వార్తలు

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన సాగు చట్టాలు దేశ వ్యవసాయ రంగంలో కొత్త యుగానికి నాంది అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ తెలిపారు. అవి రైతులకు లాభం చేసేవని పేర్కొన్నారు. ఇప్పటికే ఐదు దఫాలుగా రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపామని.. మరో విడత చర్చల కోసం ఓ తేదీని ప్రకటించాలని కోరుతూ అన్నదాతలకు లేఖను రాశారు.

new-farm-laws-to-herald-new-era-in-indian-agriculture
సాగు చట్టాలు వ్యవసాయ రంగంలో కొత్త యుగానికి నాంది: తోమర్​
author img

By

Published : Dec 22, 2020, 8:28 PM IST

నూతన సాగు చట్టాలు.. దేశ వ్యవసాయ రంగంలో కొత్త యుగానికి నాంది పలుకుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ అన్నారు. అభ్యంతరం ఉన్న అంశాలపై రైతు సంఘాల నేతలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. క్లబ్​ ఆఫ్​ సౌత్​ ఆసియాలో విదేశీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. కొత్త చట్టాల ద్వారా రైతులకు జరిగే లాభాలను వారికి వివరించారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిది. 2022 నాటికి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రధాని పని చేస్తున్నారు. రైతుల ఆసక్తికి అనుగుణంగా ఈ చట్టాలను చేశాం. 40 రైతు సంఘాలతో.. ఐదు దఫాలుగా చర్చించాం. అయినా గత నాలుగు వారాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దిల్లీకి వచ్చే అన్ని సరిహద్దులను స్తంభింపజేశారు.

- నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

మరో విడత చర్చల కోసం, ఒక తేదీని నిర్ణయించాల్సిందిగా కోరుతూ.. తోమర్​ అన్నదాతలకు ఓ లేఖను రాశారు. తమ ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు వ్యవసాయంలో అతిపెద్ద సంస్కరణలు అని ఆయన చెప్పారు. ఇవి ఒక్క రాత్రిలో తీసుకొచ్చినవి కావని.. రెండు దశాబ్దాలుగా వివిధ కమిటీలు, నిపుణులు వెల్లడించిన సలహాలు, సూచనలు మేరకే తెచ్చామని తెలిపారు.

ఇక కనీస మద్దతు ధర కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కర్షకుల పట్ల తమ వైఖరి మారదన్నారు. 2020-21 ఖరీఫ్​ సీజన్​లోనూ ఎంఎస్​పీని పెంచామని తెలిపారు. గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు, మార్పుల గురించి వివరించారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి పథకాన్ని ఉదహరించారు. దాని కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని.. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.95 వేల 979 కోట్లను ఖర్చు చేశామన్నారు. 10.59 కోట్ల అన్నదాతల కుటుంబాలు లబ్ది పొందాయని ప్రకటించారు. ఆహార సంక్షోభం నుంచి ఆహార మిగులుకు రావడానికి చాలా కాలం పట్టిందని.. వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించె దిశగా తమ సంస్కరణలు ఉన్నాయన్నారు. తాము వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే అని తెలిపారు.

ఇదీ సంగతి: పార్టీలతో సంబంధం లేదు: ప్రధానికి రైతుల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.