ETV Bharat / bharat

నూతన విద్యా విధానంతో ఆ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం!

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అదనంగా ఉదయం వేళ విద్యార్థులకు పోషకాలతో కూడిన అల్పాహారం కూడా అందించాలని నూతన జాతీయ విద్యావిధానం ప్రతిపాదించింది. ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ వారికి ఆరోగ్య కార్డులు కూడా ఇవ్వాలని సూచించింది.

New Education Policy: Breakfast for school children besides mid-day meals
నూతన విద్యా విధానంతో ఆ పాఠశాలల్లో ఉదయం అల్బాహారం
author img

By

Published : Aug 2, 2020, 11:58 AM IST

ప్రభుత్వ పాఠశాలలు, లేదా ప్రభుత్వ సాయంతో నడిచే పాఠశాలల్లో.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటే అదనంగా ఉదయం అల్పాహారం కూడా ఇవ్వాలని నూతన జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించారు. పోషకాలతో కూడిన ఉదయపు అల్పాహారం వివిధ సబ్జెక్టుల్లో పిల్లల అభ్యాస సామర్థ్యం పెంపొందించేందుకు ఎంతో సహకరిస్తుందని జాతీయ విద్యా విధానం పేర్కొంది. అందుకే మధ్యాహ్న భోజనాన్ని మరింతగా విస్తరించి ఉదయం వేళ పోషకాలతో కూడిన ఆహారం అల్పాహారం రూపంలో.. విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. పోషకాల లోపంతో బాధపడే విద్యార్థులు ఏకాగ్రతను చూపలేరని.. ఈ విషయాన్ని అనేక సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయని విద్యావిధానంలో పేర్కొన్నారు. ఉదయాన్నే వేడివేడి అల్పాహారం వీలుకాని ప్రదేశాల్లో వేరుశెనగలు, లేదా బెల్లం కలిపిన వేరుశెనగ ముద్దలు, స్థానికంగా దొరికే పండ్లు వంటివి విద్యార్థులకు అందించాలని విద్యావిధానం ప్రతిపాదించింది. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించాలని, 100 శాతం రోగనిరోధకత వారిలో పెంపొందిందో లేదో ఎప్పటికప్పుడు సరిచూసి... వారికి ప్రత్యేకంగా ఆరోగ్య కార్డులు ఇవ్వాలని పేర్కొంది.

ఐదేళ్లలోపు చిన్నారులందరూ తప్పనిసరిగా బాలవాటికకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ బాలవాటికలో చిన్నారులకు ఆటపాటల ద్వారా ఉపాధ్యాయులు వారిలో చదువుపై ఆసక్తి కలిగించడం సహా అంకెలు గుర్తించడం, అక్షరాలు నేర్పించడం వంటివి నేర్పిస్తారని తెలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో బాలవాటిక విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని సూచించింది. బాలవాటిక పిల్లలకు అంగన్‌వాడిల్లో ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయడం సహా వారి ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపింది.

ఇదీ చూడండి:- నూతన విద్యా విధానం: బంగరు భవితకు నారుమడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.