దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఈ తరహా కేసులు 38 నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ బాధితులంతా ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొంది. పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు జరుపుతున్నట్లు స్పష్టం చేసింది. వారు కూడా నిర్బంధంలోనే ఉన్నట్లు తెలిపింది.
ఎక్కడెక్కడ ఎన్ని..
- నిమ్హన్స్(బెంగళూరు) -10
- సీసీఎంబీ(హైదరాబాద్) -3
- ఎన్ఐవీ(పుణె) -5
- ఐజీఐబీ(దిల్లీ) -11
- ఎన్సీడీసీ(దిల్లీ) -8
- ఎన్‌సీబీజీ(కోల్‌కతా) -1
తొలుత బ్రిటన్‌లో గుర్తించిన ఈ కొత్త రకం కరోనా ఇప్పటికే 30కిపైగా దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇప్పటికే డిసెంబర్ 23 అర్ధరాత్రి నుంచి యూకేకు విమాన సర్వీసులను నిలిపివేసింది. జనవరి 5 వరకు ఇది అమల్లో ఉండనుంది.
ఇదీ చూడండి: ఫిబ్రవరి నుంచి ప్రియాంక 'మిషన్ యూపీ'