కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ప్రక్రియకు స్పష్టమైన వ్యూహాం అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ చౌకగా అందేలా చూడాలని కేంద్రానికి సూచించారు.
"కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే దేశాల్లో భారత్ ఒకటి. ప్రజలకు చౌకగా, నిజాయతీగా టీకా సరఫరా జరగాలి. ఇందుకు స్పష్టమైన వ్యూహం అవసరం. దీన్ని భారత ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
అంతకుముందు దేశంలో కరోనా పరిస్థితిపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో కరోనా పరిస్థితి భయానకంగా ఉందన్నారు.
ఇదీ చూడండి: 'దేశంలో కరోనా కేసుల సూచీ భయపెడుతోంది'