ETV Bharat / bharat

ఒడిశా తీరంలో ఓలివ్​ రిడ్లే తాబేళ్ల కనువిందు - Garhirmatha sanctuary in Odisha

ఒడిశా తీర ప్రాంతంలోని గహిర్​మాత నుంచి పిల్ల ఓలీవ్​ రిడ్లే తాబేళ్లు సముద్రంలోకి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. సమారు 2కోట్ల తాబేళ్లను గుర్తించినట్లు వెల్లడించారు.

Nearly 2 crore Olive Ridley turtles made their way to sea from Odisha beach: DFO
గహిరమాతకు వీడ్కోలు చెబుతున్న ఓలీవ్​ రిడ్లీ తాబేళ్లు
author img

By

Published : Jun 7, 2020, 10:16 PM IST

ఒడిశాలోని తీర ప్రాంతమైన గహిర్​​మాత అభయారణ్యంలో సుందర దృశ్యాలు కనపడుతున్నాయి. గత నెల రోజులుగా దాదాపు 2కోట్లకుపైగా ఓలివ్​ రిడ్లే జాతి తాబేళ్లు.. గుడ్ల నుంచి బయటకువచ్చి సముద్రంలోకి చేరుతున్నాయి. అంతరించిపోతున్న ఈ జాతికి ఇది శుభసూచకంలా మారింది.

ప్రపంచంలోనే అతిపెద్ద తాబేళ్ల నివాసంగా ఈ గహిర్​మాత సముద్ర తీరానికి పేరుంది. గతనెలలో దాదాపు 4.70లక్షల ఆడ తాబేళ్లు... ఈ తీరంలో గుడ్లుపెట్టి వెళ్లాయి.

"అధికారుల అంచనా ప్రకారం.. 2కోట్ల తాబేళ్లు జన్మించాయి. అనంతరం బంగాళాఖాతంలోకి చేరుకున్నాయి. ఈ ఏడాది ఎలాంటి ఆటంకాలు కలగపోవడం వల్ల.. తాబేళ్ల సంఖ్య పెరిగింది."

--- బికాశ్​ రంజన్​ డాష్​, అటవీశాఖ అధికారి.

ప్రతి ఆడ తాబేలు 100 నుంచి 120 గుడ్లు పెట్టగలదు. 45-50 రోజుల ఇంక్యుబేషన్​ సమయం అనంతరం గుడ్ల నుంచి చిన్న తాబేళ్లు బయటకు వస్తాయి.

అయితే ఈ ఓలివ్​ రిడ్లే జాతి తాబేళ్లల్లో మరణాల రేటు ఎక్కువ. వెయ్యిలో కేవలం ఒక్క తాబేలే ఎక్కువకాలం బ్రతుకుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.