ETV Bharat / bharat

'బిహార్​లో ఎన్​డీఏ పక్షాలన్నీ కలిసే పోటీ' - బిహార్ అసెంబ్లీ ఎన్​డీఏ జేపీ నడ్డా

బిహార్​ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమిలోని పార్టీలన్నీ కలిసే పోటీ చేస్తాయని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. నితీశ్ కుమార్ మరోసారి అధికారం కైవసం చేసుకుంటారని అన్నారు. ఈ మేరకు నితీశ్​తో సమావేశమైన నడ్డా.. మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకంపై చర్చించారు.

NDA will contest Bihar assembly polls unitedly, win hands down: Nadda
'బిహార్​లో ఎన్​డీఏ పక్షాలన్నీ కలిసే పోటీ'
author img

By

Published : Sep 13, 2020, 5:33 AM IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ పక్షాలన్నీ కలిసిపోటీ చేస్తాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అఖండ మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేజిక్కిచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.బిహార్​ పర్యటన చివరి రోజులో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నడ్డా ప్రసంగించారు.

అంతకుముందు జేడీయూ అధినేత నితీశ్ కుమార్​తో సమావేశమయ్యారు నడ్డా. ముఖ్యమంత్రితో గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్​డీఏ పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చించినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాల మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలు సకాలంలో పరిష్కరించే విధంగా నడ్డా హామీ ఇచ్చినట్లు సమాచారం.

చిరాగ్.. రెబల్!

ఎల్​జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఎన్​డీఏలో జేడీయూకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై చిరాగ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే మోదీ ప్రభుత్వం పట్ల విధేయతగానే ఉన్నారు చిరాగ్.

అయితే జేడీయూ, ఎల్​జేపీ మధ్య లుకలుకలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. జేడీయూ-భాజపా కూటమి గతంలో అద్భుతమైన విజయాలు సాధించిందని... కూటమిలో చివరగా చేరిన ఎల్​జేపీకి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కట్టబెట్టాల్సిన అవసరం లేదని నితీశ్ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.