ETV Bharat / bharat

లోక్​సభ స్పీకర్​ పదవి ఎవరిని వరించేనో..!

పార్లమెంట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్​సభ స్పీకర్ ఎంపికపై ఎన్డీఏ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భాజపా సీనియర్ నేతలు మేనకా గాంధీ, రాధామోహన్ సింగ్, వీరేంద్ర కుమార్​లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. కూటమిలోని కొందరు నేతలు సభాపతిగా దక్షిణాది నేతను ఎన్నుకోవాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

లోక్​సభ స్పీకర్​పై ఎన్డీఏ మంతనాలు
author img

By

Published : Jun 4, 2019, 6:21 AM IST

లోక్​సభ స్పీకర్​ పదవి ఎవరిని వరించేనో..?

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్​సభ స్పీకర్ ఎంపికపై ఎన్డీఏ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మాజీ కేంద్ర మంత్రులు మేనకా గాంధీ, రాధామోహన్ సింగ్, వీరేంద్రకుమార్​లలో ఒకరిని సభాపతిగా ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఎనిమిదో సారి ఎంపీగా ఎన్నికయిన మేనకా గాంధీ స్పీకర్ పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ప్రొటెం స్పీకర్​గా సీనియర్​ సభ్యులు వ్యవహరించాలనే సంప్రదాయాన్ని అనుసరించి మేనకా గాంధీ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

భాజపాతో ఉన్న దృఢమైన సంబంధాలు, ఆరుసార్లు లోక్​సభకు ఎంపికైన అనుభవం వల్ల మాజీ మంత్రి రాధామోహన్ సింగ్ పేరునూ పార్టీ పరిశీలించే అవకాశాలున్నాయి.

పోటీలో మరికొందరు

గత ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రిగా పనిచేసిన ఎస్.ఎస్.అహ్లువాలియా పేరూ స్పీకర్ రేసులో వినిపిస్తోంది. ఆరోసారి ఎంపీ, ఎస్సీ వర్గానికి చెందిన నేత వీరేంద్రకుమార్ సైతం రేసులో ఉన్నారు.

దక్షిణాది నేతకివ్వాలని పట్టు

భాజపా లోని దక్షిణాది నేతలు తమ ప్రాంతానికి చెందిన ఎంపీకి సభాపతి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.

డిప్యూటీ స్పీకర్​ బిజేడీకేనా?

లోక్​సభ ఉపసభాపతి పదవి ఎన్డీఏ మిత్రపక్షమైన బిజేడీకి చెందిన భర్తృహరి మహతాబ్​కు ఇవ్వాలని ఎన్డీఏ పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2017 సంవత్సరంలో ఉత్తమ పార్లమెంటేరియన్​గా అవార్డునందుకున్నారు భర్తృహరి.

లోక్​సభ తొలి విడత సమావేశాలు జూన్ 17న మొదలుకానున్నాయి. జూన్ 19న స్పీకర్​ ఎన్నిక జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.