ETV Bharat / bharat

కారు ప్రమాదంలో ఎన్సీపీ నేత సజీవదహనం - శానిటైజర్​

ఎన్సీపీ నాయకుడు సంజయ్​ షిండే(55) కారు ప్రమాదంలో సజీవదహనమయ్యారు. షార్ట్​సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కారులో ఉన్న హ్యాండ్​ శానిటైజర్​.. మంటలు పెరిగేందుకు కారణమైందని భావిస్తున్నారు.

NCP leader SPOT DEAD in car accident
కారు ప్రమాదంలో ఎన్సీపీ నేత సజీవదహనం
author img

By

Published : Oct 15, 2020, 5:16 AM IST

మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లా ఎన్సీపీ నాయకుడు సంజయ్​ షిండే(55) కారు ప్రమాదంలో సజీవదహనం అయ్యారు. ముంబయి-ఆగ్రా హైవే మీద ప్రయాణం చేస్తుండగా నాసిక్​ సమీపంలోని పింపాల్​గావ్​ బస్వంత్​ టోల్​ప్లాజా వద్ద కారు షార్ట్​సర్క్యూట్​తో కాలిపోయింది. ద్రాక్షతోటకు క్రిమిసంహారక మందులు తీసుకువచ్చేందుకు వెళ్తుండగా మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ద్రాక్షసారా తయారీకి ద్రాక్షను ఎగుమతి చేసే వ్యాపారిగా నాసిక్​ జిల్లాలో సంజయ్​ షిండేకు పేరుంది. ఈయన ఎన్సీపీ తాలూకా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

ప్రమాదం జరిగినప్పుడు కారు కాడ్వా నది ఓవర్​బ్రిడ్జికి సమీపంలో ఉంది. షార్ట్​సర్క్యూట్​కు గురైనపుడు కారులో ఉన్న హ్యాండ్​ శానిటైజరు కారణంగా మంటలు అమాంతం చెలరేగినట్టు తెలుస్తోంది. కారులో ఉన్న షిండే అద్దాలు పగులకొట్టేందుకు ప్రయత్నించినా మంటలు శరవేగంగా వ్యాపించడంతో ప్రయోజనం లేకపోయింది. స్థానికులు హుటాహుటిన ఫైర్​ సిబ్బందిని పిలిచినా షిండేను కాపాడలేకపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.