మహారాష్ట్రలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఘాటుగా జవాబిచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన.. భాజపాకు మద్దతు ఇవ్వకపోతే కేవలం 50-70 సీట్లు వచ్చేవని పేర్కొన్నారు పవార్.
శివసేన పత్రిక సామ్నాకు ఇచ్చిన ముఖాముఖిలో కీలక విషయాలు పంచుకున్నారు పవార్.
"రాజకీయ నాయకులు ఓటర్లను తేలికగా తీసుకోరాదు. ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయీ లాంటి గొప్ప నేతలకే ఓటమి తప్పలేదు. ఫడణవీస్ మాట్లాడిన మాటలు.. అహంకారానికి ప్రతీకగా భావించి ఓటర్లు గుణపాఠం చెప్పాలని భావిస్తారు. మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదు. సంకీర్ణ ప్రభుత్వానికి తాను హెడ్‌మాస్టర్ లేక రిమోట్ కంట్రోల్ వంటి వ్యక్తిని కాదు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మంత్రులు సమర్థంగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహాయం అందడం లేదు. "
- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
ఇదీ చూడండి: 'ఉద్ధవ్ ఠాక్రే సర్కారుకు ఏ ఢోకా లేదు'