దంతెవాడ ఎమ్మెల్యే, భాజపా నేత భీమా మండావీ హత్య ఘటన ప్రధాన సూత్రధారి అయిన మాడ్వీ ముయ్య అనే మావోయిస్టును భద్రతా దళాలు ఛత్తీస్‌గఢ్‌లో హతమార్చాయి. మాడ్వీ ముయ్య (29) అలియాస్ జోగ కుంజమ్పై రూ.8 లక్షల నగదు రివార్డు ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో భద్రతా బలగాలు తనిఖీలకు వెళ్లిన సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డట్లు యాంటీ నక్సల్స్ డైరెక్టర్ జనరల్ గిరిధరి నాయక్ తెలిపారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. అనంతరం కాల్పుల్లో హతమైన మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
2017 ఏప్రిల్ 24న
సుఖ్మా జిల్లాలో జరిగిన బుర్కాపాల్ దాడిలోనూ కుంజమ్ హస్తముంది. ఈ దాడిలో 25 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు.
ఇదీ చూడండి: మసూద్ అంశంపై ఆగని మాటల మంటలు