ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. బిజాపుర్ జిల్లాలో ఇసుక సరఫరా చేసే ఆరు మినీ ట్రక్కులకు నిప్పుపెట్టి దగ్ధం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్పాల్ నది సమీపంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఇసుక తీసుకెళ్లేందుకు నది పక్కన నిలిపి ఉంచిన వాహనాలకు నిప్పుపెట్టి.. దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు.
ఇసుక తరలింపులో స్థానికుల మధ్య గొడవలే ఇందుకు కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇసుక కేటాయింపుల్లో తమకు దక్కలేదనే అక్కసుతోనే కొంతమంది నక్సలైట్ల మద్దతుతో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బంగాల్: సీఐడీ వాహనాలను పేల్చేసిన దుండగులు