ETV Bharat / bharat

చైనా సరిహద్దులో భారత నౌకాదళ విమానాల గస్తీ - భారత నౌకాదళం

సరిహద్దులో భారత్​ తన రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటోంది. తాజాగా నౌకాదళానికి చెందిన విమానాలను లద్దాఖ్​లోని ఘర్షణ ప్రాంతాల్లో మోహరించింది. అక్కడ చైనా బలగాల కదలికలపై నిఘా వేయడానికి వీటిని ఉపయోగించుకుంటోంది.

vNAVY PLANES AT LADAKH AMID TENSIONS IN BORDER WITH CHINA
చైనా సరిహద్దులో నౌకాదళ విమానాల గస్తీ
author img

By

Published : Jul 22, 2020, 6:50 AM IST

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ తన రక్షణ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. తాజాగా నౌకాదళానికి చెందిన విమానాలను ఘర్షణ ప్రాంతాల వద్దకు రప్పిస్తోంది. జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనే అంశంలో త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం సాధించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నౌకాదళానికి చెందిన పి-8ఐ విమానాలను తూర్పు లద్దాఖ్‌లో ప్రభుత్వం మోహరించింది. అక్కడ చైనా బలగాల కదలికలపై నిఘా వేయడానికి వీటిని ఉపయోగించుకుంటోంది. 2017 సిక్కింలోని డోక్లామ్‌ వద్ద చైనా సైన్యంతో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, గత ఏడాది జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌ బలగాల కదలికలపై కన్నేసి ఉంచడానికి కూడా పి-8ఐలను భారత్‌ రంగంలోకి దించింది.

నౌకాదళానికే చెందిన కొన్ని మిగ్‌-29 యుద్ధవిమానాలను ఉత్తర ప్రాంతంలోని కీలక వైమానిక స్థావరాల్లో భారత్‌ మోహరించే అవకాశం ఉంది. మన నేవీ వద్ద ఈ తరగతి పోరాట విమానాలు దాదాపు 40 వరకూ ఉన్నాయి. వాటిలో 18 లోహవిహంగాలు విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై మోహరించాయి. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30 ఎంకేఐ, జాగ్వార్‌, మిరాజ్‌-2000 వంటి యుద్ధవిమానాలు ఇప్పటికే చైనాతో ఉన్న సరిహద్దుల్లో మన దేశం మోహరించింది. నౌకాదళ యుద్ధవిమానాలు కూడా రంగంలోకి దిగితే భారత దాడి సామర్థ్యం మరింత పెరుగుతుంది.

తూర్పు లద్దాఖ్‌కు రఫేల్‌!

ఈ నెలాఖరులో భారత్‌ చేరుకోనున్న ఐదు రఫేల్‌ యుద్ధవిమానాలను ఆగస్టు ద్వితీయార్ధంలో తూర్పు లద్దాఖ్‌లో మోహరించాలని మన వాయు సేన భావిస్తోంది. వీటి వల్ల ఆ ప్రాంతంలో మన దేశానికి వ్యూహాత్మకంగా పైచేయి లభిస్తుంది.

అమెరికాతో యుద్ధవిన్యాసాలు

మరోవైపు చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం సోమ, మంగళవారాల్లో అమెరికా నేవీతో కలిసి యుద్ధవిన్యాసాలు నిర్వహించింది. ఇందులో అమెరికాకు చెందిన విమానవాహక నౌక యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ నేతృత్వంలోని పలు యుద్ధనౌకలు పాల్గొన్నాయి. భారత నౌకాదళానికి చెందిన నాలుగు అగ్రశ్రేణి యుద్ధనౌకలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. గత నెలలో జపాన్‌తో కలిసి మన దేశం ఇలాంటి విన్యాసాలను నిర్వహించింది.

ఇదీ చూడండి:- సైన్యానికి సాయంగా సరిహద్దుల్లో గస్తీకి స్వదేశీ డ్రోన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.