ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో భేటీ అయ్యారు ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్. ముంబయిలోని ఫడణవీస్ నివాసంలో ఇరువురు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రేపు సుప్రీం తీర్పు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఎన్సీపీతోనే ఉన్నట్లు కొద్ది గంటల ముందు ప్రకటించారు అజిత్ పవార్. భాజపా-ఎన్సీపీ కూటమి అయిదేళ్ల పాటు సుస్థిర పాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అంతా మంచే జరుగుతుందని.. కాస్త సహనం అవసరమని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.