ETV Bharat / bharat

'మోదీజీ.. చైనా సైన్యాన్ని ఎప్పుడు పంపుతారో చెప్పండి'

author img

By

Published : Oct 20, 2020, 6:20 PM IST

భారత భూభాగం నుంచి చైనా సైనికుల్ని ఎప్పుడు వెనక్కి తరముతారో తెలుసుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. చైనా గురించి ప్రధాని నరేంద్రమోదీ కనీసం పెదవి విప్పడం లేదని రాహుల్ ఆక్షేపించారు.

Nation wants to know when will Chinese troops be "thrown out" of Indian territory, Rahul tells PM
'మోదీజీ.. చైనా బలగాలను ఎప్పుడు వెనక్కి పంపుతారో చెప్పండి'

ప్రపంచంలో ఏ దేశం కూడా తన భూభాగంలో ఇతర దేశాల అధికారాన్ని సహించడం లేదని కాంగ్రెస్ ​నేత రాహుల్​గాంధీ అన్నారు. సరిహద్దుల్లో ఇంత జరుగుతున్నా నోరు మెదపని నాయకత్వం భారత్‌లోనే ఉందని రాహుల్ విమర్శించారు. ఈ విషయం తనను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని వయనాడ్ పర్యటనలో చెప్పారు.

మోదీ ఇప్పటికైనా చైనా బలగాల్ని మన భూభాగం నుంచి ఎప్పుడు తరిమేస్తున్నారో దేశ ప్రజలకు చెబితే బాగుంటుందని రాహుల్ అన్నారు. అసలు ఈ విషయంలో సమాధానం చెప్పే ధైర్యం ప్రధానికి ఉందని తాను అనుకోవడం లేదని విమర్శించారు.

ఇదీ చూడండి:ఆ వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆమోదించను: రాహుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.