ETV Bharat / bharat

జూన్​లో మోదీ 'లెటర్స్​ టు మదర్​' పుస్తకం విడుదల - ప్రధానమంత్రి

యుక్తవయసులో ప్రధాని మోదీ రోజూ రాత్రి.. జగత్​ జనని (దేవీ మాత)కి లేఖలు రాసేవారు. అందులో 1986కు చెందిన లేఖలు.. ఇప్పుడు "లెటర్స్​ టు మదర్​" పేరుతో పుస్తకంగా ప్రజల ముందుకు రానుంది. ప్రముఖ సినీ విశ్లేషకులు భావనా సోమాయా అనువదించిన ఈ పుస్తకం జూన్​లో విడుదల కానుంది.

Narendra Modi's 'Letters to Mother' to release in June
జూన్​లో మోదీ 'లెటర్స్​ టు మథర్​' పుస్తకం విడుదల
author img

By

Published : May 28, 2020, 10:27 PM IST

Updated : May 29, 2020, 9:38 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచించిన 'లెటర్స్​ టు మదర్' పుస్తకం జూన్​లో విడుదలకానుంది. ప్రముఖ సినీ విశ్లేషకులు భావనా సోమాయా అనువదించిన ఈ పుస్తకానికి కార్పర్​కోలిన్స్​ పబ్లిషర్​గా వ్యవహరిస్తోంది. ఇది ఈ-బుక్​ రూపంలో అందుబాటులో ఉండనుంది.

Narendra Modi's 'Letters to Mother' to release in June
మోదీ 'లెటర్స్​ టు మథర్​'

యుక్తవయస్సులో ఉన్నప్పుడు ప్రతి రోజు రాత్రి.. దేవీ మాతకు లేఖలు రాయడం మోదీకి అలవాటు. దేవీ మాతను ప్రధాని అనేకమార్లు 'జగత్​ జనని'గా కూడా అభివర్ణించారు. కానీ ఆయనే వాటిని చింపేసి, ఆ కాగితాలకు నిప్పుపెట్టేవారు. అయితే 1986లో తన డైరీలో రాసుకున్న కొన్ని కాగితాలు మాత్రం బయటపడ్డాయి.

"ఇది సాహిత్య రచన కోసం నేను చేసిన ప్రయత్నం కాదు. నా అభిప్రాయాలు, ఆలోచనలు, పరిశీలనలకు ఈ రచనలు అద్ధంపడతాయి. నేను రచయితను కాదు. మనలో చాలా మంది రచయితలు కాదు. కానీ తమలోని భావాలను వ్యక్తపరచాలని అందరికీ ఉంటుంది. ఆ భావాలు ఎక్కువైతే.. కలం కాగితంపైకి వెళ్తుంది. కచ్చితంగా రాయాలని ఏం లేదు. కానీ మనసు, మెదడులో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సినీరంగంపై భావనా సోమాయా అనేక పుస్తకాలు రాశారు. ఆమెకు 2017లో పద్మ శ్రీ పురస్కారం లభించింది. మోదీలో ఉన్న భావోద్వేగాలే ఆయన రచనలకు బలం అని భావనా పేర్కొన్నారు.

Last Updated : May 29, 2020, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.