ETV Bharat / bharat

మోదీ మరో ఘనత- ఆ జాబితాలో 4వ స్థానం - మోదీ వార్తలు

భారత్​ను అత్యధిక కాలం పాలించిన నాలుగో ప్రధానిగా నరేంద్రమోదీ ఘనత సాధించారు. మాజీ ప్రధానులు జవహార్​ లాల్​ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్​ తర్వాతి స్థానంలో నిలిచారు. కాంగ్రెస్సేతర ప్రధానుల్లో మొదటి స్థానంలో ఉన్నారు మోదీ.

modi
ప్రధాని మోదీ
author img

By

Published : Aug 13, 2020, 6:13 PM IST

ప్రధాని నరేంద్రమోదీ మరో ఘనత సాధించారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానుల్లో నాలుగో స్థానంలో నిలిచారు. మాజీ ప్రధానులు జవహార్ లాల్​ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్​.. మోదీ ముందు వరుసలో ఉన్నారు.

కాంగ్రెసేతర వ్యక్తుల్లో మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీని దాటుకుని మొదటి స్థానంలో నిలిచారు. దేశానికి 14వ ప్రధానిగా 2014 మే 26న మోదీ ప్రమాణ స్వీకారం చేసి పూర్తి కాలం పాలించారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మే 30న మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. భారత 74వ స్వాతంత్య్ర వేడుకలకు రెండురోజులు ముందుగా మోదీ ఈ ఘనత సాధించటం విశేషం.

మొదటి స్థానంలో..

భారత్​కు అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా జవహార్​ లాల్​ నెహ్రూ మొదటిస్థానంలో ఉన్నారు. స్వాతంత్య్రం అనంతరం నుంచి ఆయన మరణించే వరకు 17 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. నెహ్రూ తర్వాత ఆయన కుమార్తె ఇందిరా గాంధీ దాదాపు 16 ఏళ్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్​ సింగ్ రెండు దఫాలు కలిపి 10 ఏళ్లు అధికారంలో ఉన్నారు.

కాంగ్రెస్సేతర ప్రధానుల్లో మోదీ, వాజ్​పేయీ మినహా ఐదేళ్ల పాటు ఎవరూ అధికారంలో కొనసాగలేదు.

ప్రధాన మంత్రిపరిపాలన కాలం
మొరార్జీ దేశాయి 2.5 ఏళ్లు
చరణ్ సింగ్ 170 రోజులు
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 343 రోజులు
చంద్రశేఖర్​ 223 రోజులు
హెచ్​డీ దేవేగౌడ 324 రోజులు
ఐకే గుజ్రాల్ 332 రోజులు

ఇదీ చూడండి: నూతన పార్లమెంటు ప్రాజెక్ట్​ రేసులో 3 పెద్ద సంస్థలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.