ETV Bharat / bharat

అగ్రరాజ్యాధిపతికి సాదర స్వాగతం- రోడ్​ షో ప్రారంభం - ట్రంప్ విజిట్ ఇండియా

అహ్మదాబాద్​ విమానాశ్రయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు సాదర స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అక్కడి నుంచి మోటేరా స్టేడియం వరకు నిర్వహించే భారీ రోడ్​ షోను ప్రారంభించారు ఇరువురు అగ్రనేతలు.

Namaste Trump: US president arrives in Ahmedabad
అగ్రరాజ్యాధిపతికి సాదర స్వాగతం.. రోడ్​ షో ప్రారంభం
author img

By

Published : Feb 24, 2020, 12:07 PM IST

Updated : Mar 2, 2020, 9:28 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కుటుంబ సమేతంగా భారత్​కు చేరుకున్నారు. గుజరాత్​ అహ్మదాబాద్​లోని​ సర్దార్​ వల్లాభ్​భాయ్​ పటేల్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో 11: 40కి షెడ్యూల్​ ఉండగా మూడు నిమిషాల ముందే 11:37 గంటలకు దిగింది ఎయిర్​ఫోర్స్​ వన్​. అగ్రరాజ్యాధిపతికి సాదర స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ట్రంప్​ను హత్తుకుని స్వాగతించారు.

ట్రంప్​తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్​, కుమార్తె ఇవాంక, అల్లుడు కుష్నర్​ సహా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు.

అగ్రరాజ్యాధిపతికి సాదర స్వాగతం

అనంతరం మోటేరా స్టేడియం వరకు నిర్వహించే భారీ రోడ్​ షోను ప్రారంభించారు ఇరువురు నేతలు. సుమారు 22 కిలోమీటర్ల మేర ఈ రోడ్​ షో సాగనుంది. ఇందులో భాగంగానే సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు ట్రంప్​. అనంతరం మోటేరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్​ కార్యక్రమంలో పాల్గొంటారు.

Last Updated : Mar 2, 2020, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.