ETV Bharat / bharat

'మోదీని ఆ వివరాలు అడగగలరా నడ్డాజీ?' - భారత్​ చైనా సరిహద్దు ఘర్షణలు

2010-2013 మధ్య కాలంలో భారత్​-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలపై కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని జేపీ నడ్డా డిమాండ్ చేయడంపై స్పందించారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ఘర్షణలు జరగటం వాస్తవమేనన్నఆయన.. 2015 నుంచి జరిగిన వాటిపై ప్రధానిని వివరణ అడగగలరా? అని నడ్డాను ప్రశ్నించారు.

Nadda will not dare to ask PM Modi to explain 2,264 Chinese incursions since 2015: Chidambaram
నడ్డా..ప్రధానిని ఆ వివరాలు అడుగుతారా..?
author img

By

Published : Jun 23, 2020, 2:59 PM IST

2015 నుంచి జరిగిన చైనా చొరబాట్లపై ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయగలరా అని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రశ్నించారు కాంగ్రెస్​ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరం. యూపీఏ హయాంలో జరిగిన చొరబాట్లపై నడ్డా చేసిన విమర్శల్ని తిప్పికొడుతూ ఈమేరకు ట్వీట్ చేశారు చిదంబరం.

Nadda will not dare to ask PM Modi to explain 2,264 Chinese incursions since 2015: Chidambaram
చిదంబరం ట్వీట్​​

'భారత్‌-చైనా సరిహద్దుల్లో 2010 నుంచి 2013 వరకు 600 దాడులు జరిగాయని, వాటికి వివరణ ఇవ్వాలని జేపీ నడ్డా అడిగారు. అవును.. నిజమే అవన్నీ జరిగాయి. కానీ, ఎక్కడా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు. ఆ దాడుల్లో ఎప్పుడూ మన సైనికులు ప్రాణాలు కోల్పోలేదు. అలాగే 2015 నుంచి ఇప్పటి వరకు ఇరు దేశాల సరిహద్దుల్లో 2,264 దాడులు జరిగాయి, మరి వీటికి సంబంధించిన వివరాలను ప్రస్తుత ప్రధానిని నడ్డా అడుగుతారా..?' అని వరుస ట్వీట్లు చేశారు చిదంబరం.

ఇదీ చూడండి:ఓవైపు చైనా.. మరోవైపు నేపాల్​... ఎందుకిలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.