కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు కోసం పౌరుల నుంచి సృజనాత్మక ఆలోచనలతో లోగో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మై గవర్నమెంట్.ఇన్ వెబ్సైట్ ద్వారా లోగో రూపొందించేందుకు పోటీ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
" సరికొత్త ఆవిష్కరణ, స్వావలంబన స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు మై గవర్నమెంట్.ఇన్ ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత్ లోగో రూపకల్పన పోటీ నిర్వహిస్తున్నాం. ప్రజలను భాగస్వాములుగా చేసే మైగవర్నమెంట్ వెబ్సైట్ ఇప్పటికే పలు విభాగాలకు లోగోను రూపొందించింది. అందులో స్వచ్ఛ భారత్, దేకో అప్నాదేశ్, లోక్‌పాల్ వంటివి ఉన్నాయి."
- ప్రకటన
రూ.25వేల బహుమతి
ఈ పోటీలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవటానికి ఆగస్టు 5 వరకు తుది గడువు విధించింది కేంద్రం. పోటీలో విజేతగా నిలిచిన లోగోకు రూ. 25,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి: ఆగస్టు 1న ఆన్లైన్ 'హ్యాకథాన్'లో ప్రధాని ప్రసంగం