ETV Bharat / bharat

ముజఫర్​నగర్​ అల్లర్ల కేసులో అందరూ నిర్దోషులే! - సాక్షులు

సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్​ ముజఫర్​నగర్ అల్లర్ల కేసులో... 12 మంది నిందితులను స్థానిక న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

ముజఫర్​నగర్​ అల్లర్ల కేసులో అందరూ నిర్దోషులే!
author img

By

Published : May 29, 2019, 3:11 PM IST

ముజఫర్​నగర్​ అల్లర్ల కేసులో సరైన సాక్ష్యాధారాలు లేనందున 12 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ స్థానిక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
అదనపు జిల్లా సెషన్స్​ కోర్టు న్యాయమూర్తి సంజీవ్​ కుమార్​ తివారి, ఐపీసీ సెక్షన్ 395 (దోపిడీ, హింసాత్మక చర్యలు), సెక్షన్​ 436 (గృహదహనం)లను పరిగణలోకి తీసుకుని.. ఈ 12 మందిని నిర్దోషులుగా ప్రకటించారు.

సాక్ష్యాలు లేవు..?

2013 సెప్టెంబర్​ 7 ఉత్తరప్రదేశ్​ ముజఫర్​నగర్​లో జరిగిన అల్లర్లలో దుండగులు.. ఇషాద్​ గ్రామంలోని ఇళ్లకు నిప్పుపెట్టారు. స్థానికుల ఆస్తులపై దోపిడీకి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) 13 మంది అనుమానితులపై ఐపీసీ సెక్షన్​ 495, సెక్షన్​ 436 ప్రకారం కేసులు నమోదు చేసింది. అయితే సుదీర్ఘంగా ఈ కేసు విచారణ జరిగింది. ఈ లోపు ఓ నిందితుడు మరణించాడు.

ఇప్పుడు ఫిర్యాదుదారు మహమ్మద్​ సులేమాన్​తో సహా ముగ్గురు సాక్షులు సైతం ప్రాసిక్యూషన్​కు వ్యతిరేకంగా మారినందున నిందుతులను నిర్దోషులుగా విడుదల చేసింది న్యాయస్థానం.

ఇదీ చూడండి: నరేంద్రుడి పాలనకు ఎన్​ఆర్​ఐలు ఫిదా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.