ETV Bharat / bharat

ప్రపంచంపై విషం చిమ్ముతున్న 'కరోనా' కాలనాగు! - corona cases in india

కరోనా వైరస్ ఉద్ధృతి ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. వైరస్ ధాటికి వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 26 దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. వైరస్​ను 'విశ్వవ్యాప్త సాంక్రామిక వ్యాధి'గా పరిగణించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నా- మాయదారి వైరస్‌ విధ్వంసక సామర్థ్యాన్ని బట్టి నేడు ఏ దేశమూ ఉదాసీనంగా ఉండే వీల్లేదు. చైనాలో పడగ విప్పిన ఈ కాలనాగు మన దేశంలో కట్టుతప్పకుండా ఉండాలంటే పరస్పర సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెగ్గుకురావాలి!

corona, china
కరోనా
author img

By

Published : Feb 6, 2020, 7:35 AM IST

Updated : Feb 29, 2020, 9:00 AM IST

మహా కార్చిచ్చు ఏదో పెచ్చరిల్లినట్లు, భయానక కాలనాగు కసిగా గరళం చిమ్ముతున్నట్లు- కేసులు, ప్రాణనష్టం తీవ్రతల రూపేణా కరోనా వైరస్‌ ఉద్ధృతి ప్రపంచ దేశాల్ని కలవరపరుస్తోంది. సంక్షోభ కేంద్రమైన చైనా, హుబెయ్‌ ప్రావిన్సులో రెండు రోజుల వ్యవధిలోనే బలైన 130మంది సహా కరోనా మూలాన మరణాల సంఖ్య అయిదు వందలకు చేరువైంది.

26 దేశాలకు..

చైనాలోనే దాదాపు పాతికవేల మందికి సోకినట్లు నిర్ధారించిన మహమ్మారి వైరస్‌ బాధిత జాబితాలో ఇప్పటికే భారత్‌ సహా 26 దేశాల పేర్లు చేరాయి. ఫిలిప్పీన్స్‌, హాంకాంగుల్లోనూ మరణాలు నమోదయ్యాయి. ఈ దశలో దీన్ని 'విశ్వవ్యాప్త సాంక్రామిక వ్యాధి'గా పరిగణించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నా- మాయదారి వైరస్‌ విధ్వంసక సామర్థ్యాన్ని బట్టి నేడు ఏ దేశమూ ఉదాసీనంగా ఉండే వీల్లేదు.

ఇదీ యుద్ధమే!

పాములు, గబ్బిలాలనుంచి మనుషులకు సంక్రమించిందంటున్న వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో గడ్డు సవాలు ఎదుర్కొంటున్నామన్న చైనా అధ్యక్షులు షీ జిన్‌పింగ్‌ బహిరంగ ఒప్పుకోలు- అక్కడి సంక్షుభిత వాతావరణాన్ని కళ్లకు కడుతోంది. పది రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించి విస్తృత వైద్య సేవలందిస్తూ, 13 నగరాల్లో సుమారు నాలుగు కోట్లమందికి పైగా ప్రజల కదలికల్ని నియంత్రిస్తూ చైనా నేడు అక్షరాలా యుద్ధమే చేస్తోంది! వుహాన్‌ నగరంలో చిక్కుబడిన తమ పౌరుల్ని ప్రత్యేక విమానాల్లో వెనక్కి రప్పించిన భారత్‌ వంటి దేశాలు వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా, అటువంటి వసతులు తమవద్ద లేవని పాకిస్థాన్‌ చేతులెత్తేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు, అన్ని దేశాలూ చేతులు కలిపి చురుగ్గా పనిచేస్తేనే వైరస్‌ విజృంభణను కట్టడి చేయడం సుసాధ్యమవుతుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను గట్టిదెబ్బ తీయగలదంటున్న 'ఆత్యయిక పరిస్థితి'ని ఎదుర్కోగల వ్యవస్థాగత సన్నద్ధత ప్రపంచ దేశాల్లో ఏపాటి అన్నదే చిక్కుప్రశ్న.

అప్పటి సార్స్​..

పద్దెనిమిదేళ్ల క్రితం చైనాలోనే తొలుత వెలుగు చూసిన సార్స్‌ (అత్యంత తీవ్ర శ్వాస కోశ సమస్య) మహోత్పాతాన్ని ప్రస్తుత కరోనా సంక్షోభం స్ఫురణకు తెస్తోంది. అప్పట్లో స్వీయ ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయన్న వెరపుతో అతి గోప్యంగా వ్యవహరించిన బీజింగ్‌, ఈసారి జీవాయుధ ప్రయోగయత్నం వికటించి ప్రపంచానికే పెను ప్రమాదం వాటిల్లజేసిందన్న కథనాలు దిగ్భ్రాంతపరచాయి. సమస్య మూలం నికరంగా ఏమిటన్నది ఎప్పటికైనా నిగ్గు తేలుతుందో లేదో!

వ్యాధులు.. మరణాలు..

ఆనాడు కెనడా, వియత్నాం, సింగపూర్‌ వంటివి సమర్థ వ్యూహంతో మరణాలు తగ్గించడంలో సఫలమయ్యాయి. ఇప్పుడు చైనా ఏ ఒక్క అవకాశాన్నీ ఉపేక్షించకుండా కరోనా నియంత్రణను లక్షిస్తోంది. అప్పట్లో ప్రపంచం నలుమూలలా సార్స్‌ బాధితులు రమారమి ఎనిమిది వేల మందిలో మృతుల సంఖ్య ఇంచుమించు ఎనిమిది వందలు. 2009లో రెండున్నర లక్షలకు పైబడిన స్వైన్‌ ఫ్లూ కేసులలో మరణాలు దాదాపు మూడు వేలు. ఒక్క 2014లోనే ఎబోలా వైరస్‌ పాలబడి ఏడువేలమంది దాకా ప్రాణాలు కోల్పోయారు.

వాణిజ్యంపై ప్రభావం

నేడు వేగంగా ప్రాణాలు కబళిస్తూపోతున్న కరోనా వైరస్‌ వాణిజ్య రంగానా కల్లోలం సృష్టిస్తోంది. ఆ ధాటికి మిర్చి ధరలు తల వేలాడేశాయి. భారత్‌లోనే అతిపెద్ద మిర్చి విపణి స్థలి అయిన గుంటూరు మార్కెట్‌ యార్డులో పక్షందాకా క్వింటా రూ.12వేల వరకు పలికిన ధర- చైనాకు ఎగుమతులు పడిపోయి, సగానికి పతనమైంది. సూరత్‌ వజ్రాల వ్యాపారం మొదలు చైనాతో వాణిజ్య కార్యకలాపాలన్నింటిపైనా కరోనా ప్రభావం ప్రస్ఫుటమవుతోంది. 2002నాటి సార్స్‌ బీభత్స సమయానికి ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా నూతన సభ్య దేశం. నేడు అంతర్జాతీయంగా మూడోవంతు దాకా వృద్ధికి కేంద్రంగా ఎదిగిన చైనాతో వాణిజ్య బంధం ముడివడిన ప్రతి దేశం నష్టభీతితో కలత చెందుతోంది. మరోవైపు, ఆగకుండా మోగుతున్న మృత్యుభేరి జనావళిని నిలువునా వణికిస్తోంది.

పర్యాటకంపై పంజా

చైనా సర్వశక్తులూ కూడగట్టుకుని, యంత్రాంగాన్ని ఉరకలెత్తిస్తున్నా అక్కడి పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఫిలిప్పీన్స్‌, హాంకాంగ్‌లలో ప్రాణ నష్టం వెలుగు చూడటంతోనే వాణిజ్య పర్యాటకాలపై పెద్దయెత్తున భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ పర్యాటకంపైనా కరోనా పంజా దెబ్బ తాలూకు దుష్ఫలితాలు కనిపిస్తున్నాయి. తనవంతుగా కేంద్రం- కేరళ తరహాలో సన్నద్ధం కావాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపిచ్చింది.

తెలుగు రాష్ట్రాలకు అక్కడే

ప్రైవేటు ఆస్పత్రుల్లో అనుమానాస్పద కరోనా కేసులను సర్కారీ దవాఖానాలకు బదలాయించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కరోనా అనుమానితులకు గాంధీ ఆస్పత్రిలోనే పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు. కరోనాపై దేశీయ పోరు ఇలా రాష్ట్రస్థాయి చొరవతోనే ఫలప్రదమయ్యే అవకాశం లేదు. స్వస్థ సేవల లభ్యత, నాణ్యతల ప్రాతిపదికన 195 దేశాల జాబితాలో భారత్‌ 145వ స్థానాన అలమటిస్తోంది. సకాలంలో సరైన వైద్య సేవలందక ఏటా 24 లక్షల దాకా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ఈ గడ్డమీద విషజ్వరాలు, సాంక్రామిక వ్యాధులకు తరచూ కోరలు మొలుస్తున్నాయి.

నెగ్గుకురావాలి

ఇప్పటివరకు సరైన చికిత్స అందుబాటులో లేని వైరస్‌ దేశంలో విజృంభిస్తున్న వేళ, కేరళ నమూనాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తక్కిన రాష్ట్రాల్ని అప్రమత్తం చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీరిపోదు. జాతరలు, సంబరాలకు నెలవైన దేశంలో జనచేతన కసరత్తు, ఆస్పత్రుల్లో అత్యవసర వసతుల పరికల్పన కీలకాంశం. దేశంలో ఎక్కడ ఏ మూల అనుమానించదగ్గ కేసులు నమోదైనా పరిస్థితి చేయిదాటకుండా సకలవిధ తోడ్పాటు అందేలా పకడ్బందీ జాతీయ కార్యాచరణ ప్రణాళికను సత్వరం పట్టాలకు ఎక్కించాలి. చైనాలో మారణకాండ సృష్టిస్తున్న కరోనా వైరస్‌ ఇక్కడ కట్టుతప్పకుండా పరస్పర సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెగ్గుకురావాలి!

ఇదీ చదవండి: 2021 చివరి నాటికి భారత్​కు ఎస్​-400 క్షిపణి: రష్యా

Intro:Body:

Beherampur: A 75 year old woman, Kumari Nayak from Ganjam district  has palced his name in the Guinness World Records book for having maximum number of fingers. She has 19 toes and 12 fingers.

Nayak was born with polydactylism – a common abnormality at birth where the person has extra fingers and toes.

Conclusion:
Last Updated : Feb 29, 2020, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.