ETV Bharat / bharat

ట్రెక్కింగ్​ థ్రిల్లింగ్​గా ఉండాలంటే ఈ పర్వతాలు ఎక్కాల్సిందే

మేఘాలను తాకే పర్వత శిఖరాన్ని చేరుకుని చుట్టూ చూస్తే ప్రకృతి సౌందర్యం అనిర్వచనీయ అనుభూతి కలిగిస్తుంది. కేరళ కొట్టాయం జిల్లాలోని ముత్తుకోరమల పర్వతాలపైకి ఎక్కితే సరిగ్గా అలాంటి అనుభవవమే పొందొచ్చు. ట్రెక్కింగ్​ను ఇష్టపడే వారికి ఈ ప్రదేశం థ్రిల్లింగ్​గా ఉంటుంది.

Muthukoramala Hills as a care of Address for Adventure Trips
ఇరుకుపచ్చికలో... ఎన్ని మలుపులో..!
author img

By

Published : Nov 3, 2020, 8:23 AM IST

ఇరుకుపచ్చికలో... ఎన్ని మలుపులో..!

అత్యంత ఎత్తులో, పచ్చతివాచీతో పర్యటకులకు స్వాగతం పలుకుతుంది ఈ ప్రదేశం. ట్రెక్కింగ్‌ ముందుకు సాగే కొద్దీ... అంతెత్తున ఉండే పచ్చికతో మార్గం ఇరుకుగా మారుతుంది. స్థానికంగా ఆ గడ్డిని "కొత్తపుల్లు" అంటారు. మేఘాలను తాకే ఆ పర్వత శిఖరాన్ని చేరుకున్న చుట్టూచూస్తే ప్రకృతి సౌందర్యం అనిర్వచనీయ అనుభూతి కలిగిస్తుంది. కేరళలోని కొట్టాయం జిల్లా కున్నొన్ని సమయంలో ఉన్నాయి ముత్తుకోరమల పర్వతాలు.

కొండపైకి నడక ఆషామాషీ కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రాళ్ల బాటలో జారిపడే ప్రమాదం ఉంటుంది. అందుకే అక్కడ ట్రెక్కింగ్‌కు ఒంటరిగా కాక తోడు తీసుకునివెళ్లడం ఉత్తమం.

ఇటీవల చాలామంది యువత ముత్తుకోరమలశ్రేణుల్లో ట్రెక్కింగ్‌ కోసం వస్తున్నారు. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు, వర్షం ఉన్నప్పుడు ట్రెక్కింగ్‌ చేయవద్దనే వారికి విజ్ఞప్తి. అది చాలా ప్రమాదకరం. ఏదేమైనా, కేరళ పర్యటక పటంలో చోటు దక్కించుకున్న ఈ ప్రాంత అందాలు ఆస్వాదించాలంటే ఔత్సాహికులు ఒకసారి ఇక్కడికి రావాల్సిందే.

-జాయ్ జార్జ్‌, సామాజిక కార్యకర్త

వంగమాన్‌ పర్వతశ్రేణులకు దాదాపు సమానమైన ఎత్తులో నిలిచి ఉంటాయి ముత్తుకోరమల‌ పర్వతాలు. కొట్టాయం జిల్లాలోని మరో పర్యాటక కేంద్రమైన ఇల్లికల్‌ మాలా కొండలకు కూడా సమానస్థాయిలో ఉంటాయి ముత్తుకోరమల్‌ పర్వతాలు. క్రమంగా అక్కడ పర్యాటక సందడి పెరుగుతుండడంతో స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మేము ఇక్కడే ఉండే స్థానికులం. ముత్తుకోరమలకు వచ్చే పర్యటకులకు వ్యతిరేకం కాదు. అయితే పర్యటకులు స్థానికులకు సమస్యలు సృష్టించకూడదు. ఇక్కడ మేం తాగడానికి ఉపయోగించే మంచినీటి వనరుల్లో ప్లాస్టిక్, చెత్త పడేసి కలుషితం చేయొద్దనే విజ్ఞప్తి. ఇక్కడ శాంతియుతంగా జీవిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎవరైనా పర్యటించవచ్చు.

-రామ కృష్ణన్‌, స్థానికుడు

ఇలా చేరుకోవాలి...

ముత్తుకోరమల హిల్స్​కు చేరుకోవాలంటే... కొచ్చి విమానాశ్రయం నుంచి రహదారి మార్గంలో 2గంటల 45 నిమిషాలు, కొట్టాయం రైల్వే స్టేషన్‌ నుంచి గంటన్నర ప్రయాణం ఉంటుంది. సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్య దట్టమైనమేఘాలు, శీతలగాలులు భూలోక స్వర్గాన్ని ఆవిష్కరిస్తాయి.

ప్రకృతిఅందాలతో కట్టిపడేసే ఈ ‌ప్రదేశానికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. అక్కడో రాతి కట్టడం ఉంది. చాలాకాలం క్రితం గ్రానైట్‌ రాళ్లతో ఓ విదేశీయుడు నిర్మించిన మరిక్కి సాయిపిండే అనే ఆ బంగ్లా ముత్తుకోరమల్‌కు అదనపు ఆకర్షణ. కొవిడ్‌ అనంతరం భారీ సంఖ్యలో వచ్చే పర్యాటకులకు ప్రకృతిఅందాల విందు చేసేందుకు ఎదురుచూస్తోంది ఈ ప్రదేశం.

ఇదీ చూడండి: ఇవి స్వదేశీ బార్బీ బొమ్మలు గురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.