ETV Bharat / bharat

అయోధ్య తీర్పు: 'సంతృప్తిగా లేదు... సమీక్ష కోరతాం'

author img

By

Published : Nov 10, 2019, 8:47 AM IST

Updated : Nov 10, 2019, 8:55 AM IST

ముస్లిం పక్షాల న్యాయవాది జిలానీ అయోధ్య తీర్పు సంతృప్తిగా లేదని తెలిపారు. తీర్పును పూర్తిగా చదివి... ఆ తర్వాత పునఃసమీక్ష పిటిషన్​ దాఖలు చేస్తామని తెలిపారు. అయితే.. తీర్పుపై ముస్లిం బోర్డు  కార్యదర్శిగా మాత్రమే స్పందించానని, న్యాయవాదిగా కాదని తరువాత చెప్పుకొచ్చారు.

సంతృప్తిగా లేదు... సమీక్ష కోరతాం

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు తమకు సంతృప్తి కలిగించలేదని, పూర్తిగా చదివిన తర్వాత పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్‌ వేస్తామని ముస్లిం పక్షాల తరఫు న్యాయవాది జఫర్‌యాబ్‌ జిలానీ చెప్పారు.

తీర్పు వెలువడిన తర్వాత ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

"తీర్పు మా అంచనాలకు తగ్గట్టు లేదు. మేం ప్రార్థనలు చేసిన మసీదు స్థలాన్ని అవతలి పక్షానికి ఇవ్వడాన్ని న్యాయంగా పరిగణించడంలేదు. మసీదు ఉందంటే అక్కడ కచ్చితంగా నమాజ్‌ జరిగినట్లే. నమాజ్‌ జరిగే స్థలాన్ని మరో మతానికి ఇవ్వడం న్యాయంగా అనిపించలేదు. మా నిబంధనల ప్రకారం మసీదును ఎవరికీ దానం, ధారాదత్తం చేయకూడదు. మసీదుకు ప్రత్యామ్నాయం లేదు. బదులుగా 500 ఎకరాలిచ్చినా విలువ ఉండదు.ఈ తీర్పు ద్వారా మా హక్కులు పోయాయి’’

- జఫర్‌యాబ్‌ జిలానీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యదర్శి

యూపీ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ జాఫర్‌ అహ్మద్‌ ఫరూఖీ ఆ తర్వాత స్పందిస్తూ తీర్పును ఆహ్వానిస్తున్నామని, సవాల్‌ చేసే యోచనేమీ లేదని ప్రకటించారు. ఇద్దరి ప్రకటనల మధ్య వైరుధ్యం ఉండడంతో జిలానీ వివరణ ఇచ్చారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కార్యదర్శిగా తాను స్పందించానే గానీ సున్నీ వక్ఫ్‌బోర్డు తరఫు న్యాయవాదిగా కాదని చెప్పారు.

ఇదీ చూడండి:'అయోధ్య తీర్పుపై పాక్​ వ్యాఖ్యలు అసమంజసం'

AP Video Delivery Log - 2300 GMT News
Saturday, 9 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2248: Venezuela Concert Accident AP Clients Only 4239051
Three reported dead at concert in Caracas
AP-APTN-2226: Mexico Funerals AP Clients Only 4239050
Mexico: Last victim of ambush to be laid to rest
AP-APTN-2211: Germany Wall Reax AP Clients Only 4239049
Germans reflect 30 years after fall of Berlin Wall
AP-APTN-2138: Iraq Security Forces AP Clients Only 4239048
Iraq security forces deployed on streets of Basra
AP-APTN-2109: Bolivia Morales AP Clients Only 4239047
Bolivia's Morales, Mesa speak as police rebel
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 10, 2019, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.