ETV Bharat / bharat

వరుణుడి ప్రకోపానికి ముంబయి జలమయం

భారీవర్షాలకు ముంబయి నగరం అతలాకుతలమవుతోంది. అయితే, బుధవారం అర్థరాత్రికి మేఘాల సాంద్రత కాస్త తగ్గిందని వెల్లడించింది భారత వాతావరణ శాఖ. గురువారం వానలు తగ్గే అవకాశముందని అంచనా వేసింది.

mumbai-rains-live-reduction-in-rainfall-expected-in-mumbai-on-thursday-says-imd
వరణుడి ప్రకోపానికి రాజధాని జలమయం!
author img

By

Published : Aug 6, 2020, 10:36 AM IST

Updated : Aug 6, 2020, 1:45 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర రాజధాని ముంబయి పూర్తిగా నీటమునిగింది. బుధవారం కురిసిన భారీ వానకు రోడ్లు, వీధుల్లో వరద నీరు పొంగి పొర్లుతోంది. రవాణా స్థంభించింది. చెట్లు, విద్యుత్ స్థంభాలు కూలిపడ్డాయి. ఇళ్లు, దుకాణలు జలమయమయ్యాయి.

mumbai-rains-live-reduction-in-rainfall-expected-in-mumbai-on-thursday-says-imd
గుడిని ముంచెత్తిన గంగ

దక్షిణ ముంబయిలోని కొలాబా అబ్జర్వేటరీలో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు 293 మిమీల వర్షపాతం నమోదైంది. అయితే, ఆ తర్వాత మేఘాల సాంద్రత కాస్త తగ్గిందని, కాబట్టి గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది భారత వాతారవణ శాఖ.

డ్రైవింగ్ కాదు స్విమ్మింగ్ చేయాలేమో..

"డాప్లర్ వాతావరణ సూచీ ప్రకారం ముంబయి పరిసర ప్రాంతాల్లో మేఘాల సాంద్రత కాస్త తగ్గింది. ముంబయి, థానే, పాల్ఘర్, ఉత్తర కొంకణ్ ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశముంది. గురువారం నుంచి వర్షపాతం తగ్గుతుందని అంచనా."

-కేఎస్.హోసాలికర్, డైరెక్టర్ జనరల్, భారత వాతావరణ శాఖ

రోడ్డును కప్పేసిన వాన

ముంబయి, రాయిగఢ్, పాల్ఘర్, థానే జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రత్నగిరి, సింధుదుర్గ్, పుణే, కొల్హాపూర్, సతారా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రోడ్డుపై వరద తాండవం

ఇదీ చదవండి:75 ఏళ్ల బామ్మపై అత్యాచారం- నిందితుల్లో 66 ఏళ్ల మహిళ

Last Updated : Aug 6, 2020, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.