ETV Bharat / bharat

'మార్పు రాకపోతే ఐరాస విశ్వసనీయతకే ముప్పు' - జైశంకర్ వార్తలు

ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల కోసం ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బహుళపాక్షిక విధానం ప్రమాదంలో ఉందని.. ఇలాగే కొనసాగితే ఐరాస విశ్వసనీయత తగ్గిపోతుందని హెచ్చరించారు.

BIZ-JAISHANKAR-UN-REFORM
జైశంకర్
author img

By

Published : Oct 22, 2020, 5:01 AM IST

అంతర్జాతీయ బహుపాక్షిక విధానం తీవ్ర ప్రమాదంలో ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్​.. సంస్కరణలు ప్రసంగాలకే పరిమితం కావద్దన్నారు.

"ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే కొనసాగితే చాలా కష్టం. ఐరాసలో అందరికీ తగిన ప్రాధాన్యం ఉండదు. ముఖ్యంగా 5 శాశ్వత సభ్య దేశాల ఆధిపత్యం కొనసాగితే ఐరాస విశ్వసనీయత తగ్గిపోతుంది. దీన్ని ప్రపంచం ఎంతమాత్రం కోరుకోదు. సంస్కరణలు ప్రసంగాలకే పరిమితం కాకుండా వాటికోసం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది."

- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

గడిచిన 15 ఏళ్లుగా ఐరాసలో సంస్కరణల ప్రక్రియ ఎటూ కదలటం లేదన్నారు జైశంకర్. ఏటా చర్చలు జరుగుతూనే ఉన్నా సమస్య మళ్లీ మొదటికే వస్తోందన్నారు.

మోదీ కూడా..

సెప్టెంబర్​లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ.. ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. సమగ్రమైన సంస్కరణలు జరగకపోతే ఐరాసపై నమ్మకం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. కాలం చెల్లిన విధానాలతో ప్రస్తుత సమస్యలపై పోరాడలేమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'మానవ హక్కుల సాకుతో చట్టాల ఉల్లంఘనను సహించం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.