ETV Bharat / bharat

కాస్త మెరుగుపడిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం - Mukherjee admitted to the Army's Research and Referral Hospital

ప్రణబ్ ముఖర్జీ శ్వాసకోశ పరామితులు కాస్త మెరుగుపడినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి వెల్లడించింది. అయితే వెంటిలేటర్ సాయంతోనే చికిత్సను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

Mukherjee's respiratory parameters show slight improvement: Hospital
కాస్త మెరుగుపడిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
author img

By

Published : Aug 20, 2020, 3:04 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడినట్లు దిల్లీ ఆర్​ అండ్​ ఆర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శ్వాసకోశ సంబంధిత పరామితులు కాస్త మెరుగైనట్లు తెలిపాయి.

"ప్రణబ్​కు ప్రస్తుతం వెంటిలేటర్​ సహకారంతోనే చికిత్స అందిస్తున్నాం. కీలకమైన వైద్య సూచీలు స్థిరంగా ఉన్నాయి. ప్రత్యేక నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోంది."

-ఆస్పత్రి ప్రకటన

ముఖర్జీ ఆగస్టు 10న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. అదేరోజు ఆయనకు మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించారు. ముఖర్జీకి అంతకుముందే కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు బుధవారం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు ఆస్పత్రి వెల్లడించింది.

2012 నుంచి 2017 వరకు భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.

ఇదీ చదవండి- దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమిదే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.