ETV Bharat / bharat

ఎంఎస్​పీ ఏటా పెరుగుతూనే ఉంటుంది: రాజ్​నాథ్​ - ఎంఎస్​పీ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది: రాజ్​నాథ్​

వ్యవసాయ రంగంలో సంస్కరణల దిశగా తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు తప్పక మేలు చేస్తాయని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ)పై అపోహలు వీడి.. ఆందోళనలు విరమించాలని రైతులకు సూచించారు.

MSP will be hiked continuously in coming years: Rajnath Singh
ఎంఎస్​పీ ఏటా పెరుగుతూనే ఉంటుంది: రాజ్​నాథ్​
author img

By

Published : Oct 1, 2020, 6:19 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని రైతులకు భరోసా ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​. కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ) కొనసాగడమే కాక ఏటా పెరుగుతుందని హామీ ఇచ్చారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు విరమించాలని అభ్యర్థించారు.

దిల్లీలోని ఇండియా గేట్​ సమీపంలో కాంగ్రెస్​ యువజన విభాగం కార్యకర్తలు ట్రాక్టర్​ను​ తగులబెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు రాజ్​నాథ్​.

"వ్యవసాయ పనుల్లో పవిత్ర ఆయుధంగా భావించే ట్రాక్టర్​కు నిప్పంటించి.. రైతుల్ని అవమానపరిచారు. నేనూ రైతు కుటుంబం నుంచే వచ్చాను. రైతులకు ప్రయోజనంలేని కార్యక్రమాలేవీ మోదీ ప్రభుత్వం చేపట్టదు. ఎంఎస్​పీ విషయంలోనూ అంతే. భవిష్యత్తులో కనీస మద్దతు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి."

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ శాఖ మంత్రి

ఈ చట్టాలపై రైతులకు ఉండే సందేహాలను నివృతి చేస్తున్నామని తెలిపారు రాజ్​నాథ్​.

ఇదీ చదవండి: ఎడారి రాష్ట్రంలో 'కుంకుమ' సిరులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.