మధ్యప్రదేశ్లో కరోనా కారణంగా ఇవాళ ఒకరు మృతిచెందారు. ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఒకరు జర్నలిస్టు.
కరోనా సోకిన పాత్రికేయుడు ఈనెల 20న అప్పటి ముఖ్యమంత్రి కమల్నాథ్ మీడియా సమావేశానికి హజరయ్యారు. అదే కార్యక్రమానికి వెళ్లిన ఇతర జర్నలిస్టులు తమ పరిస్థితి ఏంటోనని ఇప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
"అప్పటి ముఖ్యమంత్రి కమల్నాథ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, అనేక మంది జర్నలిస్టులు ఆ మీడియా సమావేశానికి హాజరయ్యారు. నేను కూడా అతడిని కలిశాను. ఈ విషయం తెలియటం వల్ల అందరూ భయపడుతున్నారు. తన కుమార్తె విదేశాల నుంచి వచ్చిందని తెలిసినప్పుడు ఈ సమావేశానికి హాజరుకాకుండా ఉండాల్సింది" అని ఓ సీనియర్ పాత్రికేయుడు అన్నారు.
కుమార్తె నుంచేనా?
కరోనా సోకిన జర్నలిస్టు కుమార్తె ఇటీవలే లండన్ నుంచి వచ్చారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఆమె నుంచే తండ్రికీ వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఆమె తల్లికి, సోదరుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా వైరస్ నెగిటివ్గా వచ్చినట్లు వెల్లడించారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు.
ఇదీ చూడండి : సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?