మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతోంది. 4 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
జ్వరం, మూత్రాశయ సంబంధిత సమస్యలు తలెత్తటం వల్ల ఈ నెల 11న ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు టండన్. గవర్నర్‌ను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను.. వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అయితే తాము అందించిన చికిత్స వల్ల టండన్ ఆరోగ్యం కొంత మెరుగుపడిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌కు చేసిన కరోనా పరీక్షలు నెగటివ్‌గా తేలినట్టు వివరించాయి.
ఇదీ చూడండి:- అద్దె కట్టలేదని కాల్చేసిన యజమాని