మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను తొలగించింది కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. భద్రతా సిబ్బందిని ఇతర ప్రాంతాల్లో ఎన్నికల విధుల వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టారు.
ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి తిరిగి భద్రత కల్పించాలని ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కోరారు భోపాల్ లోక్‌సభ అభ్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.
भोपाल राष्ट्रीय स्वयं सेवक संघ कार्यालय से सुरक्षा हटाना बिल्कुल उचित नहीं है मैं मुख्य मंत्री कमल नाथ जी से अनुरोध करता हूँ कि तत्काल पुन: पर्याप्त सुरक्षा देने के आदेश दें।
— digvijaya singh (@digvijaya_28) April 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">भोपाल राष्ट्रीय स्वयं सेवक संघ कार्यालय से सुरक्षा हटाना बिल्कुल उचित नहीं है मैं मुख्य मंत्री कमल नाथ जी से अनुरोध करता हूँ कि तत्काल पुन: पर्याप्त सुरक्षा देने के आदेश दें।
— digvijaya singh (@digvijaya_28) April 2, 2019भोपाल राष्ट्रीय स्वयं सेवक संघ कार्यालय से सुरक्षा हटाना बिल्कुल उचित नहीं है मैं मुख्य मंत्री कमल नाथ जी से अनुरोध करता हूँ कि तत्काल पुन: पर्याप्त सुरक्षा देने के आदेश दें।
— digvijaya singh (@digvijaya_28) April 2, 2019
"భోపాల్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను తొలగించడం సరైందికాదు. తక్షణమే భద్రతను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కోరుతున్నా " - దిగ్విజయ్ సింగ్ ట్వీట్
దీనిపై స్పందించి వెంటనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను పునరుద్ధరించాలనిసీఎంఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి మొదట భద్రతను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.
చౌహాన్ విమర్శలు..
ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రత ఉపసంహరణపై ప్రభుత్వాన్ని విమర్శించారు భాజపా నేత,మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కారణం లేకుండానే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను తొలగించారని ఆరోపించారు. రక్షణ కావాలని సంఘ్ ఎప్పుడూ పోలీసులను కోరలేదని... అందుకోసం ఇతరులపై ఆధారపడలేదని పేర్కొన్నారు.