ETV Bharat / bharat

పాల కేంద్రాల్లో స్పెషల్​ చికెన్​ అమ్మకం- కిలో రూ.900

మధ్యప్రదేశ్  ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో తప్ప మరెక్కడా పెరగని కడక్​నాథ్​ కోడి మాంసాన్ని, గుడ్లను పాలకేంద్రాల్లో అమ్మేందుకు సిద్ధమవుతోంది. ప్రయోగాత్మకంగా భోపాల్​లో ఓ కేంద్రాన్ని నేడు ప్రారంభించింది. అయితే ఈ నిర్ణయంపై భాజపా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.

పాల కేంద్రాల్లో సర్కార్ చికెన్ వ్యాపారం- విపక్షం గరం
author img

By

Published : Sep 14, 2019, 3:37 PM IST

Updated : Sep 30, 2019, 2:20 PM IST

పాల కేంద్రాల్లో సర్కార్ చికెన్ వ్యాపారం

పాల కేంద్రాల్లో కడక్​నాథ్​ కోడి మాంసం, గుడ్లు అమ్మేలా నిర్ణయం తీసుకుంది మధ్యప్రదేశ్​లోని​ కమల్​నాథ్​ సర్కార్. రాష్ట్ర పశు, పౌల్ట్రీ కోఆపరేషన్​ ఆధ్వర్యంలో నడిచే భోపాల్​లోని ఓ​ పాలకేంద్రంలో పైలట్​ ప్రాజెక్ట్​ను ప్రారంభించింది. పబ్లిక్​ ప్రైవేట్​ భాగస్వామ్యంలో ఈ కేంద్రాలను నడపాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం కడక్​నాథ్​ చికెన్​ ధర మార్కెట్లో కిలో రూ.900గా ఉంది.

ఈ కోడి మాంసంలో ఆరోగ్యకరమైన అత్యధిక పోషక విలువలు ఉండటం వల్ల బాగా డిమాండ్​ ఉంది.

"కడక్​నాథ్​ కోడి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయోగాత్మకంగా భోపాల్​లో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని చర్చిస్తున్నాం. ఈ పైలట్​ ప్రాజెక్ట్​ విజయవంతమైన ఈ కేంద్రాలను ఇంకా విస్తరిస్తాం."
- లఖన్​ సింగ్, రాష్ట్ర పశు సంవర్థక మంత్రి

భాజపా ఆగ్రహం...

ఈ నిర్ణయంపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది.

"ఆవు పాలు, కడక్​నాథ్​ మాంసం ఒకే కేంద్రంలో అమ్మడానికి వీల్లేదు. ఇది మత విశ్వాసాలను దెబ్బతీసినట్లే. ఆవు పాలను స్వచ్ఛంగా భావించి.. పూజాధికాలకు వినియోగిస్తారు. ఉపవాస దీక్షలకు వాడతారు. రెండింటికీ వేర్వేరు పార్లర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."
- రమేశ్​ శర్మ, భాజపా ఎమ్మెల్యే

భాజపా విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చింది. కేంద్రం ఒక్కటే ఉన్నప్పటికీ పాలు, మాంసం నిల్వ, విక్రయాలకు వేర్వేరు కేబిన్​లు ఉంటాయని స్పష్టం చేసింది.

2018 ఆగస్టులో కడక్​నాథ్​ మాంసంపై మధ్యప్రదేశ్​ జబువా జిల్లా భౌగౌళిక సూచిక (జీఐ) ట్యాగ్​ సాధించింది. ఇక్కడ నుంచే ఈ మాంసం సరఫరా అవుతుంది. ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల మధ్య కడక్​నాథ్​ కోళ్ల మూలాల హక్కులపై ఎన్నో ఏళ్లు పోరాటం నడిచింది.

New Delhi, Sep 14 (ANI): Home Minister Amit Shah said that the country that leaves its language loses its existence too. While speaking on a event on the occasion of Hindi Diwas, Amit Shah said, "There are many countries in this world whose languages have become extinct. The country that loses its language can't preserve its culture."

Last Updated : Sep 30, 2019, 2:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.