మధ్యప్రదేశ్ జబలాపుర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బార్గీ బైపాస్ వద్ద ప్రైవైట్ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 35 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ జబలాపుర్ జిల్లాకు 10 కి.మీ దూరంలో ఉన్న బార్గీ బైపాస్ వద్ద అర్ధరాత్రి 12.30 నిమిషాలకు దారుణం జరిగింది. కట్నీ నుంచి బాలాగాట్కు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. ఎదురుగా వస్తోన్న లారీని ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటలో 8 ఏళ్ల చిన్నారితో సహా ఐదుగురు మరణించారు. గాయపడిన 35 మందిని అధికారులు జబలాపుర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:పాక్ కాల్పులకు దీటుగా బదులిచ్చిన భారత్