మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో 'హింగోట్ ఉత్సవం' సందడిగా సాగింది. ఈ పండుగలో భాగంగా గౌతమ్పుర, రంగీ గ్రామాలకు చెందిన ప్రజలు అగ్ని మతాబులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు.
దీపావళి పండుగ తర్వాత రోజు ఏటా సంప్రదాయంగా ఇక్కడి ప్రజలు హింగోట్ ఉత్సవం జరుపుకుంటుంటారు.
ఏమిటీ హింగోట్?
హింగోట్ అనేది ఒక మతాబులాంటిది. వీటి తయారీ చాలా గమ్మత్తుగా ఉంటుంది. స్థానికంగా దొరికే ఒక పండులోని గుజ్జు తీసేసి... గన్‌పౌడర్, బొగ్గు, సల్ఫర్ నింపుతారు. ఆ పండు కాడకు నిప్పుపెట్టి ఎదుటివారిపైకి విసురుతారు.
ఇదీ చూడండి: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే