ETV Bharat / bharat

ఐఏఎస్​ అధికారికి కరోనా- ప్రభుత్వం అప్రమత్తం​​ - Coronavirus in Madhya Pradesh

సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనాకు ఎవరూ అతీతులు కాదు. తాజాగా మధ్యప్రదేశ్​లో ఇద్దరు ఆరోగ్య శాఖాధికారులకు కరోనా సోకింది. అందులో ఒక ఐఏఎస్​ అధికారి ఉన్నారని వైద్యాధికారులు వెల్లడించారు.

MP: 2 senior health dept officials test positive for COVID-19
ఇద్దరు ఆరోగ్య శాఖాధికారులకు కరోనా.. ఒకరు ఐఏఎస్​​
author img

By

Published : Apr 4, 2020, 10:20 PM IST

మధ్యప్రదేశ్​ ఆరోగ్యశాఖకు చెందిన ఇద్దరు మహిళా అధికారులకు కరోనా సోకింది. బాధితుల్లో ఒక ఐఏఎస్​ అధికారి ఉన్నారు. వీరు భోపాల్​లో విధులు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఇద్దర్ని ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు భోపాల్​లో 17 మంది వైరస్​ బారిన పడ్డారు.

దేశంలో 3వేల కేసులు

దేశంలో కరోనా కేసులు 3 వేలు దాటాయి. ఒక్కరోజులో 775 మందికి కరోనా సోకినట్లు తేలింది. దేశంలో మొత్తంగా 3072 మందికి కరోనా సోకిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు 75 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

ఇదీ చూడండి: ప్రైవేటు ల్యాబ్​ల్లోనూ ఉచితంగా కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.