ETV Bharat / bharat

'అటల్'​ టన్నెల్లో​ వరుస ప్రమాదాలు.. ఇదే కారణం! - అటెల్​ సొరంగ మార్గంలో ప్రమాదాలు

ప్రపంచంలోని అతి పొడవైన సొరంగ మార్గం అటల్​ టన్నెల్.. ​ప్రారంభించిన తరువాతి రోజే ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఒకేరోజు ఆ మార్గంలో మూడు యాక్సిడెంట్లు జరిగాయి. దానికి కారణం ఏమయ్యుంటుంది?

atal tunnel
'అటల్'​ టన్నెల్లో​ వరుస ప్రమాదాలు.. ఇదే కారణం!
author img

By

Published : Oct 6, 2020, 12:30 PM IST

హిమాచల్​​ ప్రదేశ్​లోని అటల్​ సొరంగ మార్గాన్ని... అక్టోబర్​ 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనంగా ప్రారంభించారు. ఆ మరుసటి రోజే... అక్కడ పలు యాక్సిడెంట్లు జరిగాయి. వాహనదారుల అతివేగం, సెల్ఫీ తీసుకోవడం కారణంగానే ఈ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ మార్గంలో పర్యవేక్షణ చేపట్టని స్థానిక అధికారులపై బోర్డర్స్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​(బీఆర్​ఓ) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్​ఓ వ్యాఖ్యలపై స్పందించిన హిమాచల్​ రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల తర్వాత పోలీసులను నియమించింది.

'ఎప్పుడో చెప్పాం..'

తాము ఈ మార్గంలో ట్రాఫిక్​ను నియంత్రించడానికి కావాల్సిన బలగాల సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి జులై 3న పంపించినట్లు బీఆర్​ఓ చీఫ్​ ఇంజినీర్​ కె.పి.పురుషోత్తమ్​ చెప్పారు. అక్టోబర్​ 2న స్థానిక అధికారులకు అందించినట్లు తెలిపారు.

"అక్టోబర్​ 4న జరిగిన మూడు ప్రమాదాలకు కారణం.. అతివేగమే. సొరంగ మార్గాన్ని దాటుతుండగా మధ్యలో వాళ్లు తమ వాహనాలను ఆపారు. సీసీటీవీల్లో ఈ విషయం నమోదైంది. డబుల్ లేన్​గా మారేవరకు ఈ దారి మధ్యలో వాహనాలను ఆపేందుకు అనుమతి లేదు. ఓవర్​ టేకింగ్​ చేయడానికి వీలు లేదు."

-- కె.పి.పురుషోత్తం, బీఆర్​ఓ ఛీఫ్

టన్నెల్​ ఆవిష్కరించిన రోజు... భద్రతా సిబ్బందిని నియమించడం, ఫైర్​ ఇంజిన్​ ఏర్పాటు చేయాల్సిందిగా స్థానిక పోలీసులకు బీఆర్​ఓ సూచించింది.

భద్రతా చర్యలు...

అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సొరంగ మార్గంలోకి మండే పదార్థాలను అనుతించడం లేదు. ప్రతిరోజూ.. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటలపాటు మార్గాన్ని మూసేసి శుభ్రం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. శీతల వాతావరణంలో వాహనదారుల భద్రత కోసం... చండీగఢ్​కు చెందిన స్నో అండ్​ అవలాంచె స్టడీ ఎస్టాబ్లిష్​మెంట్​ ఈ సొరంగంలో యాంత్రిక నిర్మాణాలను సిద్ధం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.