బాబ్రీ మసీదు పరిమాణంలోనే అయోధ్య మసీదు కూడా ఉంటుందని ఐఐసీఎఫ్(ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్) ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు అదేశాల మేరకు ధన్నీపుర్ గ్రామంలో కేటాయించిన ఐదెకరాల స్థలంలో ఆసుపత్రి, లైబ్రరీ, మ్యూజియం కూడా ఉంటాయని ఆఫీస్ బేరర్ ఒకరు వెల్లడించారు. రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ ఆహార నిపుణులు పుష్పేష్ పంత్.. మ్యూజియంకు క్యురేటర్‌గా విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.
"15వేల చదరపు అడుగుల్లో మసీదు నిర్మితమవుతుంది. మిగిలిన భూమిలో ఆసుపత్రి, లైబ్రరీ, ఇండో-ఇస్లామిక్ రిసెర్చ్ సెంటర్ వంటివి ఉంటాయి."
--- అథర్ హుస్సేన్, ఐఐసీఎఫ్ ప్రతినిధి.
జామియా మిలియా ఇస్లామియా ప్రొఫెసర్ ఎస్ఎమ్ అక్తర్.. అయోధ్య మసీదు రూపశిల్పిగా ఉంటారని అథర్ పేర్కొన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి గతేడాది నవంబర్ 9న చారిత్రక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేశించింది సుప్రీం. ఈ నేపథ్యంలో మసీదు నిర్మాణానికి ఐఐసీఎఫ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది సున్నీ వక్ఫ్ బోర్డు.
ఇదీ చూడండి:- అయోధ్య మసీదు లోగోను విడుదల చేసిన ఐఐసీఎఫ్