కర్ణాటక మంగళూరు నగరంలో చదువుతోన్న 200 మందికి పైగా కేరళ విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. ముందు జాగ్రత్త చర్యగా వీరందరి నమూనాలను బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించారు. ఇది కొత్తరకం కరోనానో కాదో తేలాల్సి ఉంది.
స్ట్రెయిన్ కేసులు..
ఇటీవల ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చిన కొందరిలో కొత్తరకం కరోనా (స్ట్రెయిన్) వెలుగుచూసింది. బ్రిటన్ నుంచి కేరళకు వచ్చిన ప్రయాణికుల్లోనూ ఈ వైరస్ను కనుగొన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: '25శాతం ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీలు'