కరోనా లాక్డౌన్ వల్ల సాధారణ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిర్దేశించిన కొన్ని మార్గాల్లోనే 230 రైళ్లు నడుస్తుండగా... ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
అయితే ఎన్ని రైళ్లు పట్టాలెక్కించనున్నరనేది మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. కొత్త రైళ్ల కోసం కొద్ది రోజుల్లోనే ప్రకటన చేయనున్నట్లు రైల్వేశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇదీ చూడండి: ఎల్ఓసీ వెంబడి భారీ స్థాయిలో ఆయుధాలు పట్టివేత