ETV Bharat / bharat

రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

author img

By

Published : Jul 13, 2020, 6:23 PM IST

దిల్లీలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. రికవరీ రేటు గణనీయంగా వృద్ధి చెందుతోందని ప్రకటించింది కేజ్రీవాల్​ ప్రభుత్వం. గత 12 రోజుల్లో రోజువారీ కొత్త కేసుల కన్నా రికవరీలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం దిల్లీ రికవరీ రేటు 80 శాతం ఉందని వెల్లడించింది.

More people recovering daily from COVID-19 in Delhi
రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా.. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. జులైలో గడిచిన 12 రోజుల్లో రోజు వారీ కేసుల్లో వైరస్​ బారిన పడిన వారి కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపింది.

జులై 1-12 తేదీల మధ్య దిల్లీలో 25,134 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే.. 31,640 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రికవరీలు.. ఆరు రోజుల్లో 2వేలకుపైగా ఉండగా మూడు రోజుల పాటు 3వేల మందికిపైగా వైరస్​ బారి నుంచి బయటపడ్డారు. జులై 9న అత్యధికంగా 4 వేలకుపైగా రికవరీలు నమోదయ్యాయి.

రాజధానిలో జులై 12 నాటికి మొత్తం కేసులు 1,12,494కు చేరగా.. 89,968 మంది కోలుకున్నారు.

వివిధ తేదీల్లో కోలుకున్నవారి సంఖ్య

తేదీకోలుకున్నవారి సంఖ్య
జులై 11,644
జులై 23,015
జులై 32,617
జులై 42,632
జులై 6749
జులై 7 2,129

దిల్లీ రికవరీ రేటు 80%

దిల్లీలో రికవరీ రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా 80 శాతం మేర ఉన్నట్లు తెలిపారు అధికారులు. జూన్​లోనే కరోనా వైరస్​ రికవరీ రేటు ప్రారంభమైందని.. నెలాఖరుకు 66 శాతానికి చేరుకుందని చెప్పారు.

రోజుకు 20వేలకుపైగా..

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పరీక్షల సామర్థ్యాన్ని పెంచింది దిల్లీ ప్రభుత్వం. రోజుకు 20వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తోంది. వైరస్​ వ్యాప్తిని అంచనా వేసేందుకు సిరోలాజికల్​ సర్వేనూ పూర్తి చేసింది.

ఇదీ చూడండి: స్మగ్లింగ్​ కేసు: సర్కారుపై అవిశ్వాస అస్త్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.