ETV Bharat / bharat

'2021 తొలినాళ్లలోనే చంద్రయాన్​-3 ప్రయోగం' - chandrayan 3

జాబిల్లి గుట్టును విప్పేందుకు భారత్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-3 ప్రాజెక్టు 2021 తొలినాళ్లలోనే ప్రయోగించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​. ఈ సందర్భంగా చంద్రయాన్​-1 మిషన్​పై కీలక విషయాలు వెల్లడించారు.

Chandrayaan- 3
'2021 తొలినాళ్లలోనే చంద్రయాన్​-3 ప్రయోగం'
author img

By

Published : Sep 7, 2020, 7:13 AM IST

భారత్​ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్​-3 ప్రయోగం 2021 తొలినాళ్లలోనే చేపట్టే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ తెలిపారు. అయితే.. చివరి క్షణంలో విఫలమైన చంద్రయాన్​-2 మాదిరిగా ఇందులో ఆర్బిటర్​​ ఉండదని తెలిపారు. ల్యాండర్​, రోవర్​లు ఉంటాయన్నారు.

"జాబిల్లిపై ఇస్రో తొలి ప్రయోగం చంద్రయాన్​-1ను 2008లో చేపట్టింది. అది చంద్రుడి ధ్రువాల వద్ద తుప్పు పడుతున్నట్లు చిత్రాలను పంపింది. దాంతో చంద్రుడిపై ఇనుముతో కూడిన రాతినేల ఉందని తేలినప్పటికీ.. అక్కడ నీరు, ఆక్సిజన్​ ఉన్నట్లు ఇంకా తెలియదు. చంద్రుడి ధ్రువాల వద్ద తుప్పు జాడలు కేవలం భూమి వాతావరణం కారణంగానే జరుగుతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్​-1 సమాచారం ప్రకారం జాబిల్లి ధ్రువాల వద్ద నీటి జాడలు ఉన్నట్లు తెలుస్తోంది. దానిని తెలుసుకునేందుకే శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ల్యాండింగ్​ సమయంలో సమస్య తలెత్తి విఫలమైన చంద్రయాన్​-2 మాదిరిగానే ఈ ప్రాజెక్టు ఉన్నప్పటికీ.. ఇందులో ఆర్బిటర్​ ఉండదు. మరోవైపు.. భారత్​ తొలిసారిగా చేపడుతోన్న మానవ సహిత గగన్​యాన్​ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యోమగాములకు శిక్షణ సహా ఇతర పనులు కొనసాగుతున్నాయి."

- జితేంద్ర సింగ్​, కేంద్ర మంత్రి

2019, సెప్టెంబర్​లో ల్యాండింగ్​ సమయంలో సమస్య తలెత్తి చంద్రయాన్​-2 విఫలమైన తర్వాత.. మూడో మిషన్​ ప్రయోగాలకు ప్రణాళికలు రచించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ ఏడాది చివరి నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా పలు ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడి.. వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇదీ చూడండి: చంద్రయాన్​-3: వచ్చే ఏడాది మళ్లీ జాబిల్లిపైకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.