ETV Bharat / bharat

ఆ రెండు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు తిరోగమనం

నైరుతి రుతుపవనాలు పశ్చిమ రాజస్థాన్​, పంజాబ్​ రాష్ట్రాల్లో వెనుతిరిగినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మరో రెండు రోజుల్లో హరియాణా, ఛత్తీస్​గఢ్​, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లోనూ తిరోగమనం చెందనున్నట్లు పేర్కొంది.

Monsoon retreat begins from parts of north India: IMD
ఆ రెండు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు తిరోగమనం
author img

By

Published : Sep 28, 2020, 5:31 PM IST

పశ్చిమ రాజస్థాన్​, పంజాబ్​ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. సాధారణ రోజుల కంటే 11 రోజుల ఆలస్యంగా తిరోగమనం చెందాయని తెలిపింది. మరో రెండు రోజుల్లో హరియాణా, ఛత్తీస్​గఢ్​, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లోనూ వెనుదిరగనున్నట్లు పేర్కొంది.

''ఈ రోజు నుంచి పశ్చిమ రాజస్థాన్​, పంజాబ్​ పరిసర ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లాయి. రానున్న ఐదు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడనుంది.''

- వాతావరణ శాఖ

వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. 9 రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైంది. గుజరాత్​, తెలంగాణ, గోవా, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కర్ణాటక ఈ జాబితాలో ఉన్నాయి.

రానున్న మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. తమిళనాడుపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.