జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతీ రుతుపవనాల ఉత్తరకొన మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతాల్లో విస్తరించినట్టు తెలిపింది.
దక్షిణ బంగాళాఖాతం సహా.. అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించాయని వివరించింది వాతావరణ శాఖ. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ 1 నాటికి భారత ప్రధాన భూభాగంలోకి అడుగుపెట్టనున్న రుతుపవనాలు.. తదుపరి వారంలో కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయని ఆమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఈ నెల చివరి నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో జూన్ 1 న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు