'దేశంలో వర్షాలు అధికంగానే కురుస్తున్నాయ్' - ndia Meteorological Department news
దేశంలో ఇప్పటివరకు సాధారణం కంటే ఆరు శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అయితే ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా కురిసినట్లు ఐఎండీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా... లద్దాఖ్‌లో అత్యల్పంగా వర్షాలు కురిశాయి.
రుతపవనాల వల్ల ఇప్పటివరకు దేశంలో సాధారణం కంటే ఆరు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అయితే ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా... లద్దాఖ్‌లో అత్యల్పంగా వర్షాలు కురిశాయి.
ఈ ప్రాంతాల్లో ఎక్కువే..
దక్షిణ భారతంలోని తమిళనాడు, పుదిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో సాధారణం కంటే 17శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో 12శాతం, ఈశాన్య రాష్ట్రాల్లో 10శాతం అధికంగా వర్షాలు కురిశాయి.
అయితే జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్‌లో 19శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ) 107శాతంగా నమోదవుతుందన్న ఐఎండీ అంచనాలు తారుమారయ్యాయి.
ఇదీ చూడండి: సీఎంలకు ప్రధాని ఫోన్- కరోనా పరిస్థితిపై ఆరా