"మురళి నిరుపేద కుటుంబంలో పుట్టాడు. 7వ తరగతి వరకే చదివాడు. తన ఇంటిపనులతో పాటు వానరాల ఆలన పాలన చూస్తాడు. స్థానికుల నుంచి రూ. 10-20 సేకరించి వానరాల్ని పోషిస్తాడు. అనేక మంది స్థానిక అధికారులు మారుతి జంతు ప్రేమకు ఫిదా అయిపోయారు. వానరాలను పోషించేందుకు వారు ఇతోధికంగా సాయపడుతుంటారు. వానరాలు అనేకసార్లు ఆయనను గాయపరిచినప్పటికీ మారుతికి వాటిపై ఏమాత్రం ప్రేమ తగ్గదు."
-స్థానికుడు, దేవనహళ్లి
ఇలా ఒకటి, రెండు వానరాలు కాదు.... కొన్ని వందల రాంబంట్లు మారుతి ఆలనలో పెరిగాయంటున్నారు స్థానికులు.
"మారుతి ఒక వానరాన్ని పిలిస్తే అన్నీ వస్తాయి. అతడి భుజాలపై ఎక్కి కూర్చుంటాయి. అతడి కనుసైగల్ని గమనించి వాటి ప్రకారం నడుచుకుంటాయి. అతడు ఆదేశిస్తే అల్లరి ఆపేస్తాయి. వేరువేరు చోట్ల వివిధ రకాల పేర్లను వానరాలకు పెడుతుంటాడు మారుతి అలియాస్ మురళి. వానరాల వయసునూ చెప్పగలడు. 15-20 ఏళ్ల సహవాసం కారణంగా 800 వానరాలతో మారుతికి స్నేహం ఏర్పడింది."
-స్థానికుడు, దేవనహళ్లి